తెలంగాణలో మోదీ పర్యటన.. నిరసన కార్యక్రమాలను ప్లాన్ చేసిన బీఆర్ఎస్

KTR Calls for protest against Singareni Privatization on April 8th. ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ ఏప్రిల్ ఎనిమిదో తేదీన హైద‌రాబాద్ కు రానున్నారు.

By M.S.R  Published on  6 April 2023 8:15 PM IST
తెలంగాణలో మోదీ పర్యటన.. నిరసన కార్యక్రమాలను ప్లాన్ చేసిన బీఆర్ఎస్

PM Narendra Modi


ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ ఏప్రిల్ ఎనిమిదో తేదీన హైద‌రాబాద్ కు రానున్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంఖుస్థాప‌న‌లు, ప్రారంబోత్స‌వాలు చేయ‌నున్నారు. ఆ రోజున నిర‌స‌న కార్యక్ర‌మాల‌కు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. సింగ‌రేణి ప్ర‌యివేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ఈ నెల 8వ తేదీన సింగ‌రేణి ప్రాంతాల్లో బీఆర్ఎస్ మ‌హా ధ‌ర్నాలు చేప‌ట్ట‌నుంది. ఈ మేర‌కు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మంచిర్యాల‌, భూపాల‌ప‌ల్లి, కొత్త‌గూడెం, రామ‌గుండం ఏరియాల్లో మ‌హా ధ‌ర్నాలు చేప‌ట్టాల‌ని పిలుపునిచ్చారు.

8వ తేదీన ప్రధాని హైదరాబాద్ పర్యటన రోజే బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంతో పాటు పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభకు హాజరయ్యేందుకు ప్రధాని మోదీ హైదరాబాద్‌కు రాబోతున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై ప్రధాని మోదీ ఏమి మాట్లాడుతారా అనే ఉత్కంఠ నెలకొంది.


Next Story