క్షమాపణలు చెప్పిన‌ కేటీఆర్

TGSRTC బస్సులలో ప్రయాణిస్తున్న మహిళలపై చేసిన వ్యాఖ్యలకు BRS వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే KT రామారావు (KTR) మహిళా కమీషన్ ఎదుట క్షమాపణలు చెప్పారు

By Medi Samrat
Published on : 24 Aug 2024 3:43 PM IST

క్షమాపణలు చెప్పిన‌ కేటీఆర్

TGSRTC బస్సులలో ప్రయాణిస్తున్న మహిళలపై చేసిన వ్యాఖ్యలకు BRS వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే KT రామారావు (KTR) మహిళా కమీషన్ ఎదుట క్షమాపణలు చెప్పారు. తెలంగాణ మహిళా కమిషన్ సమన్ల మేరకు కేటీఆర్ శనివారం కమిషన్ ఎదుట హాజరై తన వాంగ్మూలాలపై వివరణ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్య‌ల‌పై కేటీఆర్ విచారం వ్య‌క్తం చేసి అధికారికంగా క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఇలాంటి ప్రకటనలు సరికాదని, తన స్థాయికి తగ్గ నాయకత్వ హోదాలో ఉన్నవారు చేసి ఉండరాదని ఆయన అంగీకరించారు.

ఆయన క్షమాపణలను ఆమోదించిన కమిషన్, భవిష్యత్తులో అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కేటీఆర్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే కమిషన్ తగిన విధంగా తదుపరి చర్యలు తీసుకోవచ్చని కూడా కమిషన్ కేటీఆర్‌కు తెలిపింది.

Next Story