బొగ్గు కుంభకోణంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి భాగస్వామ్యం ఉంది: కేటీఆర్

బొగ్గు గని టెండర్ల కుంభకోణంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి భాగస్వామ్యం ఉంది..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.

By -  Knakam Karthik
Published on : 20 Jan 2026 2:27 PM IST

Telangana, coal mine tender scam, KTR, Kishanreddy, CM Revanth, Bhatti, Congress, Brs

బొగ్గు కుంభకోణంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి భాగస్వామ్యం ఉంది: కేటీఆర్

హైదరాబాద్: బొగ్గు గని టెండర్ల కుంభకోణంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి భాగస్వామ్యం ఉంది..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బొగ్గు కుంభకోణంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్‌లో సిట్ విచారణ కాదు, చిట్టి విచారణ అంటూ సీఎం రేవంత్‌పై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చినా భయపడేది లేదని అన్నారు. ఇంకో వెయ్యి సిట్‌లు వేసినా ఎదుర్కోవడానికి సిద్ధమన్న కేటీఆర్..రేవంత్‌ను వదిలేది లేదని అన్నారు.

హరీశ్‌రావుకు సిట్ నోటీసులపై కేటీఆర్ స్పందిస్తూ..హరీష్ రావును జైలుకు పంపాలని రేవంత్ రెడ్డి తహతహలాడుతున్నాడు. సుప్రీంకోర్టు కంటే రేవంత్ రెడ్డి సిట్ పెద్దదా?..అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బావమరిది కుంభకోణం బయట పెట్టినందుకే హరీష్ రావు విచారణ చేస్తున్నారని, కాంగ్రెస్ కుంభకోణాలు బయటపెట్టిన ప్రతిసారి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. వాటాల పంచాయతీ కారణంగానే నైనీ బ్లాక్ టెండర్లను డిప్యూటీ సీఎం భట్టి రద్దు చేశారు..అని కేటీఆర్ ఆరోపించారు.

అధికారులను వదిలేది లేదు..

ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగస్వామ్యం అయిన అధికారులను వార్నింగ్ ఇస్తున్నా..అని కేటీఆర్ అన్నారు. రేపు అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనని, రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడలో అధికారులు బలి కావొద్దుని కేటీఆర్ చెప్పారు. రిటైర్ అయిన అధికారులను సైతం వదిలే ప్రసక్తే లేదని కేటీఆర్ పేర్కొన్నారు. కేబినెట్‌లో దండుపాళ్యం బ్యాచ్ ఉందని, ఆ దందాల నుంచి దృష్టి మరల్చడానికే సిట్ విచారణ..అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

Next Story