నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్..!

KTR About Employment. తెలంగాణలో ఇప్పుడు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ల మద్య మాటల యుద్దం నడుస్తున్న విషయం

By Medi Samrat  Published on  9 March 2021 11:25 AM GMT
నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్..!

తెలంగాణలో ఇప్పుడు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ల మద్య మాటల యుద్దం నడుస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్య తీరుస్తామని చెప్పి ఎంతో మంది యువతను అధికార పార్టీ మోసం చేసిందన్న నినాదంతో బీజేపీ గత కొంత కాలంగా తెగ హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సైతం ఇదే నినాదం తో ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పారు.


ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ఆరున్నరేళ్లలోనే అనేక సమస్యలు పరిష్కరించామని ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. త్వరలోనే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. స్విస్ బ్యాంకుల్లోని నల్లధనం తీసుకొస్తామని ఊదరగొట్టిన కేంద్రం.. ఇప్పటివరకు పైసా తీసుకురాలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. విభజన చట్టంలోని సంస్థలను కూడా తెలంగాణకు ఇవ్వలేదని ఆరోపించారు. మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా హైదరాబాద్లోని ప్రైవేటు కళాశాలలో సమావేశం నిర్వహించారు.

హైదరాబాద్‌లోని ఎన్‌ఐడీని ఆంధ్రప్రదేశ్‌కు తరలించారు. కేంద్రాన్ని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ అడిగితే ఇవ్వలేదు. ఆరు వైద్య కళాశాలలను ఇవ్వాలని కోరితే స్పందన లేదు. భాజపా నేతలు నినాదాలు మాత్రమే ఇస్తారు.. హామీలు నెరవేర్చరు అని కేటీఆర్ అన్నారు.


Next Story
Share it