బీఆర్ఎస్ హయాంలో యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల ఏర్పాటు, విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వం దర్యాప్తు నిమిత్తం ఏర్పాటు చేసిన కమిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) మంగళవారం హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని తెలిపారు. ఈ కేసులో కమిటీకి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని, ఇంధన శాఖను ప్రతివాదులుగా చేర్చారు. చట్టాలను ఉల్లంఘించి కమిషన్‌ను ఏర్పాటు చేశారని.. నరసింహారెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి గత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం పూర్తిగా పక్షపాతంతో వ్యవహరించినట్లు ఉందని కేసీఆర్ పిటీషన్‌లో పేర్కొన్నారు.
మరోవైపు 2011లో కేసీఆర్‌పై రైల్‌రోకో కేసు విచారణపై హైకోర్టు మంగళవారం స్టే ఇచ్చింది. ఈ కేసు తెలంగాణ ఉద్యమ ఉద్యమ కాలం నాటిది.. రైల్‌రోకో ఘటనలో కేసీఆర్‌పై కేసు నమోదైంది. ఆ ఘటనతో తనకు సంబంధం లేదని.. తనపై తప్పుడు కేసు పెట్టారంటూ కేసీఆర్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఈ కేసుపై స్టే మంజూరు చేస్తూనే.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. తదుపరి విచారణను జూలై 18కి వాయిదా వేసింది.