ముఖ్యనేతలతో సమావేశమైన కేసీఆర్

బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం

By Medi Samrat  Published on  4 Dec 2023 7:45 PM IST
ముఖ్యనేతలతో సమావేశమైన కేసీఆర్

బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లి లోని తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు కేసీఆర్ ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. వారికి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు పలువురు మాజీ మంత్రులు, ఇతర నేతలు కలిశారు.

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలతో హైదరాబాద్ తెలంగాణ భవన్ లో కీలక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో ఓటమికి దారి తీసిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఓడిపోయిన నియోజకవర్గాల్లోని పరిస్థితులపై సమీక్షతో పాటు భవిష్యత్ కార్యక్రమంపై నేతల అభిప్రాయాలను కేటీఆర్ తెలుసుకున్నారు. తెలంగాణ భవన్ కేంద్రంగా అందరికీ అందుబాటులో ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.

Next Story