కేసీఆర్ ఢిల్లీ టూర్.. ఆ టాప్ లీడర్లను కలిశారు
KCR meets Akhilesh Yadav in Delhi, next Arvind Kejriwal. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.
By Medi Samrat Published on 21 May 2022 3:00 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా వివిధ రాజకీయ పార్టీల నేతలతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. రాజకీయ పార్టీల నేతలతోపాటు ప్రముఖ ఆర్థికవేత్తలతో కూడా సమావేశం కానున్నారు. దేశ ఆర్థిక పరిస్థితులపై సీఎం కేసీఆర్ చర్చిస్తారు. ఈ దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్యాహ్నం అఖిలేష్ యాదవ్‌తో భేటీ అయ్యారు.ఈ సమావేశంలో దేశానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. జాతీయ స్థాయి రాజకీయ, సామాజిక కార్యక్రమాలకు హాజరయ్యేందుకు కేసీఆర్ వారం రోజుల పర్యటనలో భాగంగా దేశ రాజధానిలో ఉండనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రాజకీయ, మీడియా, ఆర్థిక నిపుణులతో సమావేశమై దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు సహాయం చేయనున్నారు.
సాయంత్రం 5 గంటలకు, రావు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి మొహల్లా క్లినిక్‌ని సందర్శించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలను కూడా సందర్శించారు. కేజ్రీవాల్‌తో కలిసి మోతీబాగ్‌లోని సర్వోదయ స్కూల్‌ను కేసీఆర్ సందర్శించారు. అక్కడి పరిస్థితిని స్వయంగా సీఎం కేసీఆర్‌కు కేజ్రీవాల్ వివరించారు. స్కూల్ ప్రత్యేకతలు, విద్య, మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. అనంతరం విద్యాభివృద్ధిపై ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను సీఎం కేసీఆర్ తిలకించారు. పాఠశాల పరిశీలన అనంతరం మొహల్లా క్లినిక్‌లను సందర్శించారు. పాఠశాలకు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ వెంట ఎంపీలు నామానాగేశ్వరరావు, సంతోష్‌కుమార్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితోపాటు ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.