బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్‌లో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన మాజీ మంత్రులతో సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందనే అంశంపై ఈ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది.
అయితే ఈ మూడు జిల్లాల్లోనూ సభలు నిర్వహించాలనే యోచనలో బీఆర్ఎస్ ఉంది. ఈ క్రమంలోనే సభల నిర్వహణ తేదీలను ఖరారు చేసేందుకు ఈ మీటింగ్ ఏర్పాటు చేశారా అనే చర్చ జరుగుతోంది. అటు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపనై కూడా చర్చి జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేసీఆర్‌తో సమావేశానికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సహా పలువురు ముఖ్య నేతలు కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నెల 29వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.