బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌లో సతీమణి శోభతో కలిసి గణపతి హోమం నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా మధ్యాహ్నం 12 గంటలకు కేసీఆర్ పూజలో పాల్గొననున్నట్లు సమాచారం. ఈ మేరకు హోమం పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. కాగా ప్రతి సంవత్సరం వినాయక చవిత నవరాత్రి ఉత్సవాల్లో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం విజ్ఞాలు తొలగాలని కేసీఆర్ ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు మాజీ మంత్రులు ఐదు రోజులుగా ఫౌమ్‌హౌస్‌లోనే ఉన్నట్లు సమాచారం.
కాగా బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్ అనంతరం పార్టీ అధినేత కేసీఆర్‌తో కేటీఆర్ సుదీర్ఘంగా మంతనాలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాళేశ్వరంపై సీబీఐ విచారణ, జూబ్లీహిల్స్ బైపోల్స్, కవిత ఎపిసోడ్‌పై చర్చించినట్లు సమాచారం. అయితే కవిత ఆరోపణలపై ఇప్పటివరకు కేసీఆర్, కేటీఆర్ ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా హరీశ్ రావు, సంతోష్ రావులపై కవిత ఆరోపణలకు బీఆర్ఎస్‌లోని కొందరు సీనియర్ లీడర్లు కౌంటర్ ఇచ్చారు.