కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి సమర్పించిన వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాళేశ్వరం వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ రిపోర్టును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ రెండు పిటిషన్లు దాఖలు చేశారు. రాజకీయ కక్షలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేసిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. కమిషన్‌కు విచారణ అర్హత లేదని పిటిషన్‌లో తెలిపారు. పీసీ ఘోష్ కమిషన్ నిలిపివేయాలని పిటిషన్‌లో హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. కాగా ఈ రెండు పిటిషన్లు రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.