బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ..ఈ లేఖను కావాలని కల్వకుంట్ల కుటుంబమే బయపెట్టింది. రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసమే వాళ్లు ఈ డ్రామాకు తెరలేపారు. అంతేకాకుండా అసలు కేసీఆర్‌కు సలహాలు, సూచనలు చేసే స్థాయి కవితకు ఉందా?..అని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు.
బీజేపీ గురించి కేసీఆర్ ఎంతసేపు మాట్లాడాలో కూడా కవిత డిసైడ్ చేస్తారా? కేటీఆర్, హరీష్ రావు కలిసే ఈ లేఖ తయారు చేయించారు. కవిత పేరుతో బయటకు వదిలారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయి. ఆ రెండు పార్టీల మధ్య బంధం ఈ లేఖతో బయటపడింది. వరంగల్ సభతోనే బీఆర్ఎస్ పనయిపోయిందని తేలిపోయింది. రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం ఈ డ్రామాలు ఆడుతున్నారు" అని ఆయన అన్నారు.