కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలను దారుణంగా మోసం చేశారని కల్వకుంట్ల కవిత విమర్శించారు. తెలంగాణలో ఇచ్చిన "6 గ్యారంటీలు" అమలు చేయకుండా ప్రజలను నట్టేట ముంచారని, ఇప్పుడు అదే అబద్ధాల స్క్రిప్టుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళకు వెళ్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో రైతు రుణమాఫీ, ఉద్యోగ కల్పన, రైతు సంక్షేమం వంటి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆమె ఆరోపించారు. కేరళ ప్రజలు కూడా వీరి మాటలు నమ్మి బాధితులుగా మారవద్దని, కేరళ అభివృద్ధి పథంలో కొనసాగాలంటే పినరయి విజయన్ నాయకత్వాన్నే బలపరచాలని కవిత కోరారు.