కమీషన్ల కోసమే రీయింబర్స్‌మెంట్ పెండింగ్..కాంగ్రెస్‌పై కవిత ఆరోపణలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం ఆడబిడ్డల చదువులను కాలరాస్తోందని..తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు.

By -  Knakam Karthik
Published on : 15 Sept 2025 11:56 AM IST

Telangana, Kavitha Kalvakuntla, Congress government, Fee reimbursement, Cm Revanthreddy

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం ఆడబిడ్డల చదువులను కాలరాస్తోందని..తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. కమీషన్ల కోసమే కాంగ్రెస్ సర్కారు ఉద్దేశపూర్వకంగా బకాయిలను నిలిపివేసిందని, ఈ వైఖరి రాష్ట్రంలోని ఆడపిల్లల భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతోందని ఆమె తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా ఆమె ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

ప్రభుత్వం నుంచి బకాయిలు విడుదల కావాలంటే 20 శాతం కమీషన్లు ఇవ్వాలని కొందరు అడుగుతున్నట్లు కాలేజీల యాజమాన్యాలు తన వద్ద ఆవేదన వ్యక్తం చేశాయని కవిత తెలిపారు. ఏళ్ల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో కళాశాలలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయని, వాటిని నడపలేక యాజమాన్యాలు చేతులెత్తేసే పరిస్థితి వచ్చిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కమీషన్ల కోసం ప్రభుత్వం ఇలా వ్యవహరించడం వల్ల కాలేజీలు మూతపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Next Story