నవంబర్ 30న కేసీఆర్ గుడ్ బై అనాలి అంటే ముందు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పాలి
By Medi Samrat Published on 12 Oct 2023 9:25 AM GMTప్రజా గాయకుడు గద్దర్ చనిపోలేదు.. చంపారని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. గద్దర్ మరణంపై ఎంక్వయిరీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కేటీర్ కుటుంబం, కాంగ్రెస్ పెద్దల మధ్య పెద్ద కుట్ర జరుగుతుందని అన్నారు. కేసీఆర్ కుటుంబ పాలన అంతం కోసం 80 % ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎలాగో కేసీఆర్ ఓటమి ఖాయం అని తెలిసి అయన అభ్యర్థులను కాంగ్రెస్ లోకి పంపి.. కాంగ్రెస్ నుంచి గెలవడం కోసం పెద్ద ప్లాన్ జరుగుతుందన్నారు.
కేసీఆర్ దగ్గర కోట్ల ఉన్నాయి అని ఆరోపణలు చేసి ఇప్పుడు ఆ ఆరోపణలు ఏమి అయ్యాయని అన్నారు. కోదండరాం, షర్మిల రెడ్డి లను కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిప్పుకొని వాడుకొని వదిలేశారని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ముస్లీంలు అందరూ ఆలోచన చేయాలన్నారు. నవంబర్ 30న కేసీఆర్ గుడ్ బై అనాలి అంటే ముందు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పాలన్నారు. కాంగ్రెస్ దేశాన్ని సర్వ నాశనం చేసింది. అందరూ గుర్తు పెట్టుకోవాలన్నారు.
బీసీలకు ప్రజా శాంతి పార్టీ తరపున 60 సీట్లు ఇస్తున్నామని.. అన్ని సామజిక వర్గాలకు సీట్లు ఇస్తామని తెలిపారు. తెలంగాణ లో ఓటు అడిగే హక్కు ప్రజా శాంతి పార్టీకి మాత్రమే ఉందన్నారు. నా దగ్గర నల్ల ధనం లేదు... కావాల్సిన అంత తెల్ల ధనం ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పెద్దలు ఇప్పటికీ నన్ను ఎందుకు కలుస్తున్నారు.. ఒక్కసారి ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు.
ఈ సారి దొరల పాలన అంతం అవ్వాలి.. అంబేద్కర్, గద్దర్ ఆశయాలు బ్రతకాలి అంటే ప్రజా శాంతి పార్టీ గెలవాలని అన్నారు. ఎవరైనా ప్రజలకు సేవ చేయాలి అంటే ప్రజా శాంతి పార్టీ లో చేరండి. రాబోయే తెలంగాణ ఎన్నికల్లో మహిళలకు పెద్ద పీట వేస్తామని తెలిపారు. హుజురాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంత చిత్తుగా ఓడిందో.. రాబోయే ఎన్నికల్లో అలానే చిత్తుగా ఒడి పోతుందని జోష్యం చెప్పారు. కోట్లు కుమ్మరించి కాంగ్రెస్ సీట్ కోసం తాపత్రయ పడుతున్నారు. రేవంత్ రెడ్డి, కేటీర్ లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ నాటకాలు ఆడుతున్నారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు నా వెంట ఉండటం వల్లనే ఉక్కు పరిశ్రమ కేంద్రం అధీనంలోకి వెళ్లకుండా ఆపానన్నారు. తెలంగాణలో ఎన్నో సమస్యలపై కోర్టు ద్వారా తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేశానని తెలిపారు. కేటీర్ నా పై దాడి చేయించారు. అది తెలంగాణ ప్రజలు మర్చిపోరని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రజలను రెచ్చ గొట్టినా రెచ్చి పోవొద్దు.. శాంతి యుతంగా ఏదయినా సాధించాలన్నారు. తెలంగాణ నిరుద్యోగ యువత కూడా కేసీఆర్‌ను ఓడించడానికి కష్ట పడాలని పిలుపునిచ్చారు. కొన్ని మీడియా సంస్థ లు ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి అమ్ముడుపోయాయని ఆరోపించారు.
గద్దర్ ను ప్రభుత్వం చంపింది.. ఎంక్వయిరీ వేయాలని డిమాండ్ చేశారు. గద్దర్ ప్రజా శాంతి పార్టీలో చేరితే అనుక్షణం నరకం చూపించిందని.. నా దగ్గరకు వచ్చి వందల సార్లు ఏడ్చారని అన్నారు. మునుగోడులో నామినేషన్ వేయకుండా గద్దర్ ను భయపెట్టారని అన్నారు.
తెలంగాణ ప్రజలు గమనించాలి.. నీతి నిజాయితీ ఉన్న అందరూ వినాలి.. బానిస బ్రతుకులు వొద్దని.. తెలంగాణ రాష్ట్రం శ్రీలంక అవుతుందన్నారు. అన్ని పార్టీలకు ప్రతి విషయంలో అనుమతి ఇచ్చారు.. కానీ మాకు మాత్రం అడుగడుగునా అడ్డం పడ్డారని అన్నారు. ప్రతి సర్వేలో.. ప్రజలు KA పాల్ కావాలని రిపోర్ట్ వస్తుందని అన్నారు.
నా చరిత్ర ఒక్కసారి తెలుసుకోండి.. నన్ను కమెడియన్ గా చూడటం మానుకోండి.. దేశం, రాష్ట్రం నాశనం అవుతుందని అన్నారు. కొన్ని మీడియా సంస్థలు కొన్ని సామజిక వర్గాలను భుజాన వేసుకొని మోస్తున్నారని.. ప్రజా శాంతి పార్టీని మీడియాలో చూపడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. నన్ను ముఖ్యమంత్రిని చేయండి.. తెలంగాణను దేశంలో నెంబర్ 1 స్థాయికి తీసుకుని వెళ్తానన్నారు.