ఓ అన్నగా నన్ను బాధించింది, అర్థం చేసుకో..రేవంత్‌పై కేఏ.పాల్ సెటైర్లు

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.

By Knakam Karthik  Published on  16 March 2025 9:30 PM IST
Telangana, Hyderabad, Cm Revanthreddy, Ka Paul, Congress

ఓ అన్నగా నన్ను బాధించింది, అర్థం చేసుకో..రేవంత్‌పై కేఏ.పాల్ సెటైర్లు

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి 15 నెలల వ్యవధిలోనే ఫెయిల్డ్ సీఎంగా ముద్ర వేయించుకోవడం ఓ అన్నగా తనను బాధించిందని అన్నారు. "తమ్ముడూ రేవంత్ రెడ్డీ... ఇప్పుడే న్యూస్ లో చూశాను. ఈరోజు నువ్వు మీడియా రిపోర్టర్స్ ని అటాక్ చేయడం, అంతేకాకుండా 10 సంవత్సరాల వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పడం చూశాను. ఇవాళ కనీసం తాగటానికి మంచి నీళ్లు లేవు. అమీర్ పేటలో నీళ్ల కోసం ట్యాంకర్ ని తెప్పించుకుంటున్నాం. హైదరాబాదులో కోటి 20 లక్షల మంది ఉన్నారు. తెలంగాణలో నాలుగు కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు మార్చి లోనే నీళ్లు లేవంటే మరి ఏప్రిల్, మే, జూన్ లో పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు.

ఇప్పుడు నువ్వు ఏదో భారత్ సమిట్ పెడితే ఎవరు వస్తారు? ఒక్కసారి అర్థం చేసుకో... దేవుడు మనల్ని ఎందుకు కలిపాడు? నేను పోటీ చేయకుండా వరంగల్లో నీకు ఎందుకు మద్దతు ఇచ్చాను...? రాష్ట్రాన్ని బాగు చేయడానికి, అప్పులు తీర్చడానికి, అభివృద్ధి చేయడానికి, మంచి చేయడానికి... మరి నువ్వేం చేస్తున్నావ్...? బీజేపీ వాళ్ళని గెలిపిస్తున్నావ్... అలాగే రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ కి మూటలు మోస్తున్నావ్ అని అందరూ చెబుతున్నారు.

ఇప్పుడు దోచుకోవడం, దాచుకోవడం, పంచిపెట్టడమేనా లేదా ప్రజల మీద ధ్యాస ఉందా? నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు... రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు... మంచి నీళ్ల కొరత ఏర్పడుతోంది... విద్యా, వైద్యం అన్నది కనిపించట్లేదు ఈ కొద్ది కాలంలోనే నువ్వు ఇంత ఫెయిల్డ్ ముఖ్యమంత్రి అయితే ఒక అన్నగా, ఒక శాంతి దూతగా, నీ అడ్వైజర్ గా నాకు ఎంత బాధేస్తుంది?" అంటూ కేఏ పాల్ వ్యాఖ్యానించారు.

Next Story