జూబ్లీహిల్స్ బైపోల్‌.. ఆవిడే బీఆర్ఎస్ అభ్యర్థి..!

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై ఉత్కంఠత వీడింది.

By -  Medi Samrat
Published on : 19 Sept 2025 9:20 PM IST

జూబ్లీహిల్స్ బైపోల్‌.. ఆవిడే బీఆర్ఎస్ అభ్యర్థి..!

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై ఉత్కంఠత వీడింది. జూబ్లీహిల్స్ బైపోల్‌ ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ సతీమణిని అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ క్యాడర్‌తో కేటీఆర్ సమావేశమయ్యారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై ప్రకటన చేశారు. హైదరాబాద్ మహా నగరాన్ని విశ్వనగరంగా మార్చిన బీఆర్ఎస్‌ను అన్ని స్థానాల్లో గెలిపించారు. ప్రత్యర్థులు ఎంత దుష్ప్రచారం చేసినా జూబ్లీహిల్స్‌లో మూడోసారి మాగంటి గోపీనాథ్‌ను గెలిపించారు. మాగంటి గోపీనాథ్ సేవల్ని కొనసాగిస్తామని ఆయన సతీమణి సునీత మీ ముందుకు వచ్చింది. అందరూ ఆమెను ఆశీర్వదించండి అని ప్ర‌జ‌ల‌కు కేటీఆర్ విజ్ఞ‌ప్తి చేశారు.

Next Story