బీజేపీలో చేరిన జయసుధ

Jayasudha joined In BJP. కమలం పార్టీలోకి వలసలు మొదలయ్యాయి.

By Medi Samrat  Published on  2 Aug 2023 5:45 PM IST
బీజేపీలో చేరిన జయసుధ

కమలం పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. తాజాగా సినీనటి, సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీ పార్టీలో చేరారు. తరుణ్ చుగ్, కిషన్ రెడ్డిల సమక్షంలో ఆమె భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. జయసుధ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధి చూడటం వల్లే బీజేపీ పార్టీలో చేరినట్లు ఆమె తెలిపారు. సంవత్సరం నుంచి బీజేపీ నాయకులతో చర్చలు జరుగుతున్నాయని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశానన్నారు. ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని అన్నారు. కుల, మతాల పరంగా కాకుండా మంచి పని చెయ్యాలని కోరుకుంటున్నానన్నారు జయసుధ.

కొద్దిరోజులు రాజకీయాల్లో కనిపించక పోవడానికి చాలా కారణాలు ఉన్నాయని జయసుధ తెలిపారు. రాజకీయాలంటే సమయాన్ని గౌరవించాలి. టైంను నమ్ముతా ఇప్పటికీ సినిమాలు నాకు రావడం అదృష్టం అని అన్నారు. సికింద్రాబాద్ నుంచి మళ్లీ పోటీ అనేది కేవలం రూమర్ మాత్రమేనని జయసుధ తెలిపారు. తాను ఎక్కడ నుండి పోటీ చేయాలో అధిష్టానమే నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చారు. ఈరోజు ఉదయం జయసుధ ఢిల్లీ కి వెళ్లారు. గత కొద్దిరోజులుగా ఆమె బీజేపీలో చేరబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు అవి నిజమయ్యాయి.

Next Story