మాట తప్పడం, మడమ తిప్పడం ఇదేనా కాంగ్రెస్ పాలన అంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై ఫైరయ్యారు. పథకాల అమలులో ఎన్నిసార్లు మాట మార్చుతారని, ఎన్నిసార్లు ప్రజలను మోసం చేస్తారని ఎక్స్ వేదికగా మండిపడ్డారు హరీష్ రావు. వానాకాలం రైతు భరోసాను ఎగవేశారని విమర్శించారు.
యాసంగి భరోసా సంక్రాంతికి ఇస్తామని అని చెప్పిన కాంగ్రెస ప్రభుత్వం, మాట మార్చి జనవరి 26కు చెప్పారని, ఇప్పుడేమో మార్చి 31వ తేదీ వరకు అంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ రైతు బంధు ఇచ్చి రైతన్నకు దన్నుగా నిలిస్తే, దాన్ని ఎగ్గొట్టి సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి రైతులకు భరోసా లేకుండా చేశారంటూ సెటైర్ వేశారు.
ఇక ఆసరా రూ.4 వేలు, తులం బంగారం, మహిళలకు రూ.2500, విద్యా భరోసా కార్డు, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, ఇవన్నీ ఇందిరమ్మ రాజ్యంలో ఏమయ్యాయో.. ఆ ఇందిరమ్మకే తెలియాలని కౌంటర్ ఇచ్చారు.