కేరళలో ఎన్నికల ప్రచారం కోసం అసెంబ్లీని ఎత్తేస్తారా?..కాంగ్రెస్‌పై హరీశ్‌రావు ధ్వజం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎటువంటి దిశా నిర్దేశం లేకుండా, కేవలం తూతూ మంత్రంగా ముగిశాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
By - Knakam Karthik |
కేరళలో ఎన్నికల ప్రచారం కోసం అసెంబ్లీని ఎత్తేస్తారా?..కాంగ్రెస్‌పై హరీశ్‌రావు ధ్వజం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎటువంటి దిశా నిర్దేశం లేకుండా, కేవలం తూతూ మంత్రంగా ముగిశాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా హాల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆరు గ్యారెంటీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కనీస స్పష్టత ఇవ్వలేకపోయిందని విమర్శించారు. ప్రజల సమస్యలపై చర్చించే ధైర్యం లేక, కేరళ ఎన్నికల ప్రచారానికి వెళ్లడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీని అర్థాంతరంగా ముగించిందని ఆరోపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవినీతిని తాము ఆధారాలతో సహా బయటపెట్టినందునే, డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అక్రమంగా సస్పెన్షన్ వేటు వేశారని మండిపడ్డారు. సభలో ముఖ్యమంత్రి మరియు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీధి రౌడీల భాషను వాడుతూ అహంకారపూరితంగా వ్యవహరించారని, వారి ప్రవర్తనను తక్షణమే ఎథిక్స్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని, ఇది బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీల మధ్య ఉన్న 'ఫెవికాల్ బంధానికి' నిదర్శనమని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ 'ఎకనామిక్ సర్వే'తో పాటు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన లెక్కలే కాళేశ్వరం ప్రాజెక్టు విజయానికి సజీవ సాక్ష్యాలని ఆయన గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయిందని దుష్ప్రచారం చేస్తున్న నేతలు, మల్లన్న సాగర్‌లో ఉన్న 25 టీఎంసీల నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. దమ్ముంటే బీజేపీ, కాంగ్రెస్ నేతలు తమతో రావాలని, కాళేశ్వరం జలాలతో గలగలా పారుతున్న గోదావరి నీళ్లను, పండుతున్న పొలాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తామని ఆయన సవాల్ విసిరారు.
శాసన సభను గాంధీ భవన్ లా మార్చేసింది కాంగ్రెస్!ఒక్కరోజు కూడా సమయానికి మొదలు కాలేదు..ఒకరోజు ముఖ్యమంత్రి ఢిల్లీ నుండి వస్తున్నాడని , ఇంకోరోజు కేరళ నుండి వస్తున్నాడని నాలుగు గంటలు వృథా చేశారు!ఒకరోజు పెండ్లి ఉందని పోతరు, ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ అవుతున్నాడని అని సభ… pic.twitter.com/AI6YNJ9a50
— BRS Party (@BRSparty) March 31, 2026