కేసులు పెట్టి.. శునకానందం పొందాలనుకుంటే మీ కర్మ: కేటీఆర్‌

ఫార్ములా - ఈ రేసుకు సంబంధించిన కేసులో అరెస్టు చేస్తారనే ప్రచారం నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆసక్తికర ట్వీట్‌ చేశారు

By అంజి  Published on  17 Dec 2024 10:02 AM IST
Formula - E race, karma, KTR, Hyderabad, Telangana

కేసులు పెట్టి.. శునకానందం పొందాలనుకుంటే మీ కర్మ: కేటీఆర్‌

హైదరాబాద్‌: ఫార్ములా - ఈ రేసుకు సంబంధించిన కేసులో అరెస్టు చేస్తారనే ప్రచారం నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. ''బీజేపీతో ఢిల్లీలో చిట్టి గారి కాళ్ల బేరాలు, జైపూర్‌లో అదానీతో డిన్నర్‌ రిజల్ట్‌ వచ్చినట్లున్నాయి. ఢిల్లీకి పోయి 3 పైసలు తీసుకు రాకున్నా, మూడు కేసులు పెట్టి శునకానందం పొందాలనుకుంటే మీ కర్మ. గుడ్‌ లక్‌ చిట్టినాయుడు. మేం న్యాయపరంగా ఎదుర్కొంటాం'' అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

ఫార్ములా-ఈ కేసులో జరిగిన అవకతవకలపై దర్యాప్తు ప్రారంభించేందుకు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫార్ములా-ఈ రేసులో జరిగిన అవకతవకలపై కూలంకషంగా చర్చించామని తెలంగాణ శాసనసభలోని అసెంబ్లీ కమిటీ హాల్-1లో సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. కేబినెట్‌లో కేటీఆర్‌పై విచారణ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఫార్ములా-ఈ కార్ రేస్‌పై విచారణకు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదం తెలిపారని, రాష్ట్ర ప్రభుత్వానికి క్లియరెన్స్ ఇచ్చారని మంత్రి తెలిపారు.

Next Story