'కేసీఆర్, కేటీఆర్, కవిత చనిపోతే'..: వివాదానికి తెరలేపిన బీజేపీ ఎంపీ.. తిరగబడ్డ ఎమ్మెల్సీ కవిత
కేసీఆర్, కేటీఆర్ చనిపోతే బీమా ఇస్తామని బిజెపి నేత, నిజామాబాద్ ఎంపీ అరవింద్ వ్యాఖ్యానిస్తూ మంగళవారం వివాదానికి తెర లేపారు.
By అంజి Published on 18 Oct 2023 1:09 AM GMT'కేసీఆర్, కేటీఆర్, కవిత చనిపోతే'..: వివాదానికి తెరలేపిన బీజేపీ ఎంపీ.. తిరగబడ్డ ఎమ్మెల్సీ కవిత
భారతీయ జనతా పార్టీ ఎంపీ అరవింద్ ధర్మపురి అక్టోబర్ 17 మంగళవారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, కుమార్తె కే కవిత చనిపోతే రూ.5, 10, 20 లక్షలు ఇస్తానని చెప్పి వివాదానికి తెర లేపారు. బహిరంగ ర్యాలీని ఉద్దేశించి బీజేపీ నేత అరవింద్ ధర్మపురి మాట్లాడుతూ.. మృతుల కుటుంబానికి రూ.5 లక్షల భీమా (కేసీఆర్ భీమా) ఇస్తామని పేర్కొన్న మేనిఫెస్టోను ఆయన (కేసీఆర్) తీసుకొచ్చారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు ఇస్తారు.. కానీ 56 ఏళ్లు పైబడిన రైతుల కుటుంబాలకు ఇవ్వరు.. పంటలకు భీమా లేదు.. ఆరోగ్యం పాడైతే బీమా ఉండదు.. ఇదెక్కడి ఇన్సూరెన్స్ అంటూ అరవింద్ ప్రశ్నించారు.
మంగళవారం జరిగిన ఎన్నికల కార్యక్రమంలో ధర్మపురి మాట్లాడుతూ, రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్‌ఎస్ మేనిఫెస్టోను ప్రస్తావిస్తూ, కేసీఆర్ అని పిలవబడే భారత రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖర్ రావుపై మండిపడ్డారు. ''మా నిజామాబాద్ బీజేపీ మేనిఫెస్టోలో కేసీఆర్ చనిపోతే రూ.5 లక్షలు ఇస్తాం.. కేటీఆర్ చనిపోతే రూ.5 లక్షలు ఇస్తామని.. ఇప్పుడు రూ.10 లక్షలకు పెంచుతామని చెబుతున్నా.. ఎలాగూ ఆయన (కేసీఆర్) పని అయిపోయింది. యువకులు చనిపోతే (కేటీఆర్ & కవిత) ఎక్కువ మొత్తం ఇస్తాం, కవిత చనిపోతే రూ. 20 లక్షలు ఇస్తాం.. చనిపోయిన తర్వాత మరో రూ. 20 లక్షల వాచ్ ధరించవచ్చు'' అని బీజేపీ నేత తెలిపారు.
ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఎమ్మెల్సీ కవిత
తన వివాదాస్పద వ్యాఖ్యలపై బిజెపి ఎంపి అరవింద్ ధర్మపురిపై ఘాటైన దాడిని ప్రారంభించిన కవిత.. ''ఈ రోజు నేను ఇతర మహిళలతో కలిసి బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి జగిత్యాలలో ఉన్నాను. కొంతమంది మహిళలు విచారంగా నా వద్దకు వచ్చి నిజాంబాద్ ఎంపీ అరవింద్ చాలా అసభ్యంగా ప్రవర్తించారని నాకు తెలియజేశారు. నేను నిజామాబాద్‌లో ఓడిపోయిన తర్వాత మౌనంగా ఉండి గెలిచిన నాయకుడికి అవకాశం ఇచ్చాను. గెలిచిన వ్యక్తి (సంబంధిత బీజేపీ ఎంపీ) ఎంపీగా తన బాధ్యతలను మరచిపోయి నాపై వ్యక్తిగతంగా చాలాసార్లు దాడికి దిగారు'' అని అన్నారు.
‘‘తెలంగాణ ప్రజలను నేను అభ్యర్థిస్తున్నాను, నేను ఒక మహిళను, ఎంపీ అరవింద్ నాపై వాడుతున్న అవే పదాలను (అవమానకరమైన పదజాలం) ఉపయోగిస్తే మీరు (పబ్లిక్) అంగీకరించగలరా? నేను రాజకీయాల్లో ఉన్నందున మాత్రమే అతను నాకు వ్యతిరేకంగా మాట్లాడాడు. నేను కేసీఆర్ కూతురిని.. ఒప్పుకుందామా’’ అని ఆమె అన్నారు. బీజేపీ నాయకుడిపై తన దాడిని మరింత తీవ్రం చేస్తూ, "తెలంగాణలో ఇలాంటి రాజకీయాలకు ఒప్పుకుంటామా? నేను ఏదైనా ఫెయిల్ అయినప్పుడు నన్ను ప్రశ్నిస్తే ఫర్వాలేదు. కానీ మీరు (కవిత) చనిపోతే నేను 20 లక్షలు ఇస్తాను, మీ అన్నయ్య(కేటీఆర్) చనిపోతే 10 లక్షలు ఇస్తాను, మీ నాన్న(కేసీఆర్) ఇలా మాట్లాడటం, ఈ వ్యక్తిగత దాడి, ఈ భాష ఎంత వరకు కరెక్ట్ అని తెలంగాణ ప్రజానీకం ఆలోచించాలి.. ఎలాంటి ప్రకటనకైనా స్పందించే ధైర్యం నాకు ఉంది. ఎంపీ అరవింద్ మీ (పబ్లిక్) తల్లి, కుమార్తె లేదా సోదరిపై అదే పదాలను ఉపయోగిస్తే మీరు (ప్రజలు) అంగీకరిస్తారా?. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి ‘అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్’ అంటూ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలని" కవిత కోరారు.