హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంఐఎం కైవసం

హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీని ఎంఐఎం కైవసం చేసుకుంది

By Knakam Karthik
Published on : 25 April 2025 10:17 AM IST

Telangana, Hyderabad MlC Elections, Mim, Congress, Brs, Bjp,

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంఐఎం కైవసం

హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీని ఎంఐఎం కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుపై ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్ విజయం సాధించారు. ఎంఐఎం అభ్యర్థికి 63 ఓట్లు రాగా... బీజేపీ అభ్య‌ర్థి గౌత‌మ్ రావుకు 25 ఓట్లు వ‌చ్చాయి. దీంతో 38 ఓట్ల తేడాతో మీర్జా హ‌స‌న్ గెలుపొంది. హైద‌రాబాద్ ఎమ్మెల్సీ స్థానం ఎంఐఎం కైవ‌సం చేసుకుంది.

ఇక, హైద‌రాబాద్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ స్థానానికి 22 ఏళ్ల త‌ర్వాత ఎన్నిక జ‌రిగింది. బీజేపీ అనూహ్యంగా అభ్య‌ర్థిని బ‌రిలోకి దింప‌డంతో ఈ ఎన్నిక‌ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ నెల 23న ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగ్గా 112 మంది ఓటర్లకు గాను మొత్తం 88 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 78.57 శాతం పోలింగ్‌ నమోదైనట్లు రిటర్నింగ్‌ అధికారి అనురాగ్‌ జయంతి తెలిపారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పోటీకి దూరంగా ఉన్నాయి. కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకోగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు 24 మంది బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు పోలింగ్‌లో పాల్గొనలేదు.

Next Story