తెలంగాణలో స్కూళ్లకు సెలవులు పొడిగింపు

Holiday extension for schools in Telangana. ఈ నెల 30 వరకు స్కూళ్లకు సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని అన్ని విద్యాసంస్థల

By అంజి  Published on  16 Jan 2022 9:37 AM IST
తెలంగాణలో స్కూళ్లకు సెలవులు పొడిగింపు

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్‌ ఓమిక్రాన్‌ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. నేటితో సంక్రాంతి సెలవులు ముగియనున్నాయి. రేపటి నుండి స్కూళ్లు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. మరోసారి ఈ నెల 30 వరకు స్కూళ్లకు సెలవులు పొడిగిస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని అన్ని విద్యాసంస్థల సెలవులను 30. 1. 2022 వరకు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మొదట స్కూల్స్‌, కాలేజీలు మూసి వేసి ఆన్‌లైన్‌ క్లాసులు వార్తలు వచ్చాయి. అయితే రాష్ట్రంలో థర్డ్‌వేవ్‌ ముంచుకోస్తుండటంతో ప్రభుత్వం స్కూళ్లకు సెలువులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ముందస్తుగా విద్యాసంస్థలను మూసివేశారు. ఒకవేళ స్కూళ్లు ఎక్కువ రోజులు పొడిగించాల్సి వస్తే.. మళ్లీ ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే కరోనా ఆంక్షలను జనవరి 20వ తేదీ వరకు పొడిగించారు. అలాగే విద్యా సంస్థలకు కూడా సెలవులు పొడిగించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి సూచించింది. ఈ నెల 20 తేదీ వరకు రాష్ట్రంలో కరోనా ఆంక్షలు కొనసాగనున్నాయి. అలాగే విద్యా సంస్థలకు ఈ నెల 30వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. చిన్న పిల్లల్లో కరోనా వ్యాప్తి పెరగకుముందే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తే కరోనా విజృంభించే అవకాశాలు ఉన్నాయి.

Next Story