సంగారెడ్డి జిల్లా కందిలో.. 10 క్వింటాళ్ల గంజాయి పట్టివేత

Heavy cannabis seizure in sangareddy district. తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

By అంజి  Published on  29 Nov 2021 10:50 AM IST
సంగారెడ్డి జిల్లా కందిలో.. 10 క్వింటాళ్ల గంజాయి పట్టివేత

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్టణం నుండి లారీలో తీసుకొస్తుండగా 10 క్వింటాళ్ల గంజాయిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందిన సమాచారంతో పోలీసులు గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్న లారీని గుర్తించి పట్టుకున్నారు. ఆదివారం అర్థరాత్రి టైమ్‌లో సంగారెడ్డి జిల్లాలోని కంది దగ్గర పోలీసులు లారీని ఆపి తనిఖీ చేశారు. లారీలో పోలీసులు తనిఖీలు చేయగా.. తుక్కు కింద 10 క్వింటాళ్ల గంజాయిని పోలీసులు గుర్తించారు. వెంటనే వాహనాన్ని సీజ్‌ చేసిన పోలీసులు.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసులు కేసు నమోదు చేశారు. గంజాయి రవాణాపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.కోట్లలో ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గంజాయి రవాణాపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఎక్కడికక్కడే గంజాయి, మత్తు పదార్థాలకు సంబంధించిన ఆనవాళ్లు కనబడితే చర్యలు తీసుకుంటున్నారు.

ఇటీవల కూడా ఏలూరు నుండి అక్రమంగా లారీలో తరలిస్తున్న 420 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను నవంబర్‌ 16వ తేదీన సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణ కుమార్‌ తెలిపారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఇండోర్‌కు చెందిన అశోక్ కేసరి, సంజయ్ లారీ డ్రైవర్‌గా పని చేస్తూ గంజాయి రవాణా చేస్తున్నారని తెలిపారు. మార్కెట్లో గంజాయి విలువ 25 లక్షలు ఉంటుందన్నారు.

Next Story