యూరియా కొరతపై తెలంగాణ ప్రభుత్వ తీరును ఎండగడుతూ మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. షాపుల్లో దొరకాల్సిన యూరియాను యాప్‌ల ద్వారా ఇస్తామనడం రైతులను ఇబ్బంది పెట్టడమేనని, స్మార్ట్ ఫోన్ వాడటం తెలియని లక్షలాది మంది రైతుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రవ్యాప్తంగా రైతులు యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టి ఎదురుచూడటం రేవంత్ రెడ్డి తెచ్చిన మార్పుకు నిదర్శనమని మండిపడ్డారు. వెంటనే యాప్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే యూరియా పంపిణీ చేయాలని, లేదంటే ఆగ్రహించిన అన్నదాతలు జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తారని హరీశ్‌రావు హెచ్చరించారు.