ఎన్నికల కోడ్ ముగిసినా రైతు భరోసా ఏది?..కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్‌రావు నిప్పులు
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
By - Knakam Karthik |
ఎన్నికల కోడ్ ముగిసినా రైతు భరోసా ఏది?..కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్‌రావు నిప్పులు
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతుల కన్నీళ్లతో పునాదులు నిర్మించుకున్న ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించిన చరిత్ర లేదని, ప్రస్తుత ప్రభుత్వం అన్నదాతల ఉసురు పోసుకుంటోందని ఆయన మండిపడ్డారు. ఎన్నికల ముందు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాధాన్యతలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయని, పాలకుల విలాసాలకు, బడా కాంట్రాక్టర్ల కమీషన్లకు ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులకు రైతుబంధు ఇవ్వడానికి నిధులు లేవంటున్న ప్రభుత్వం, మూసీ సుందరీకరణకు, ఫోర్త్ సిటీ భూసేకరణకు, కాంట్రాక్టర్ల బిల్లుల కోసం వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తోందని హరీశ్‌రావు ప్రశ్నించారు.
మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతుబంధు జమ చేస్తామని ఫిబ్రవరి 4న మిర్యాలగూడ సభలో ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి తుంగలో తొక్కారని ఆయన విమర్శించారు. ఎన్నికల కోడ్ ముగిసి పది రోజులు దాటినా, కనీసం కేబినెట్ మీటింగ్‌లో కూడా దీనిపై చర్చించకపోవడం రైతులను వంచించడమేనని అన్నారు. ఒకవైపు నిధులు లేవంటూనే, ముఖ్యమంత్రి తన కోసం జూబ్లీహిల్స్‌లో వందల కోట్లతో ప్యాలెస్ లాంటి క్యాంప్ కార్యాలయాన్ని నిర్మించుకుంటున్నారని, ఆ కార్యాలయం చుట్టూ ఇనుప కంచెల కోసమే 9 కోట్లు, ఫుట్‌బాల్ కోర్టు కోసం 5 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ పెద్దలకు మూటలు పంపడానికి నిధులు ఉంటాయి కానీ, రైతులకు ఇవ్వడానికి చేతులు రావా అని ప్రశ్నించిన హరీశ్‌రావు, ఇప్పటికైనా నాటకాలు కట్టిపెట్టి వెంటనే రైతుబంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రైతుల కన్నీళ్లతో పునాదులు నిర్మించుకున్న ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించినట్లు చరిత్రలో లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల ఉసురు పోసుకుంటోంది. ఓట్ల కోసం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాధాన్యతలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. పాలకుల విలాసాలకు, బడా… pic.twitter.com/GHuFbe4nXc
— Harish Rao Thanneeru (@BRSHarish) February 25, 2026