అసెంబ్లీకి కేసీఆర్ వస్తారు, ఉత్తమ్‌లా కాదు మేం ఫుల్ ప్రిపేర్డ్: హరీశ్‌రావు
రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తున్నారు..అని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
By - Knakam Karthik |
అసెంబ్లీకి కేసీఆర్ వస్తారు, ఉత్తమ్‌లా కాదు మేం ఫుల్ ప్రిపేర్డ్: హరీశ్‌రావు
హైదరాబాద్: రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తున్నారు..అని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఆదివారం మీడియా చిట్‌చాట్‌లో హరీశ్ రావు మాట్లాడుతూ..శాసనసభను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. బీఆర్ఆర్ హాయాంలో ఏడాదికి యావరేజ్‌గా 32 రోజులు శాసనసభను నడిపాం. కాంగ్రెస్ వచ్చాక 2024లో 24రోజులు సభను నడిపారు. ఈఏడాది 16 రోజులు మాత్రమే సభను నడిపారు. కాంగ్రెస్ వచ్చాక యావరేజ్‌గా 20రోజులు మాత్రమే సభను నడిపారు. శాసనసభను నడపటానికి రేవంత్ రెడ్డి సర్కార్ జంకుతుంది. ప్రజా సమస్యలపై ప్రతిపక్షం అడుగుతున్న అజెండాను తీసుకోవటం లేదు. పాలమూరు ఎత్తిపోతలలో 90 టీఎంసీల నుంచి 45 టీఎంసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గించింది. 45 టీఎంసీలకు ఉత్తరం రాశారా? లేదా? సమాధానం చెప్పాలి. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల మధ్య ప్రభుత్వమే పంచాయితీ పెడుతుంది. పాలమూరు, రంగారెడ్డి డీపీఆర్ వాపస్ వచ్చిందా? లేదా? చెప్పాలి. ఇప్పటికీ డీపీఆర్ ఎందుకు రీసబ్మిట్ ఎందుకు చేయలేదు?..అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
అసెంబ్లీని 45 రోజులు జరపాలని గతంలో కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ప్రస్తుత సమావేశాలు కనీసం 15 రోజులు జరపాలి. ఉత్తమ్ కుమార్ లెక్క కాదు..సమావేశాల కోసం మేము ఫుల్ ప్రిపేర్డ్. ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వటం లేదు. స్పీకర్ కూడా సభ సంప్రదాయాలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మా సమయాన్ని కాలరాస్తున్నారు. మా హక్కులు కాపాడాల్సింది స్పీకరే. 7 మంది, 8 మంది సభ్యులున్న వారికి ఇచ్చిన సమయమే మాకూ ఇస్తున్నారు. హౌస్ కమిటీని ఎందుకు నియమించటం లేదు. వ్యవహారాల మంత్రిగా శ్రీధర్ బాబు ఫెయిల్. లోపం స్పీకర్ దగ్గర ఉందా? శాసనసభ వ్యవహారాల మంత్రి దగ్గర లోపం ఉందా? చార్జ్ తీసుకోకుండా ఉత్తమ్ పద్మావతి ఎందుకు రాజీనామా చేశారు?కాంగ్రెస్ హామీలు, ఎరువుల కొరత, రైతుబంధుపై చర్చ జరగాలి. దేవుడుపై ప్రమాణం చేసి రుణమాఫీ ఎగ్గొట్టిన దానిపై చర్చ జరపాలి. హిల్ టీపీ, జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనంపై చర్చ జరగాలి. ట్రిపుల్ ఆర్, గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల మరణాలపై చర్చ జరగాలి..అని హరీశ్ రావు డిమాండ్ చేశారు.