కేసీఆర్ సీఎం అవుతారు.. ఆ తర్వాత..!

బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో రెండేళ్లలో మరోసారి ముఖ్యమంత్రి అవుతారని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మిగిలిన అభివృద్ధి పనులు పూర్తి చేసుకుందామన్నారు.

By -  Medi Samrat
Published on : 5 Feb 2026 8:10 PM IST

కేసీఆర్ సీఎం అవుతారు.. ఆ తర్వాత..!

బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో రెండేళ్లలో మరోసారి ముఖ్యమంత్రి అవుతారని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మిగిలిన అభివృద్ధి పనులు పూర్తి చేసుకుందామన్నారు. గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీశ్ రావు మాట్లాడుతూ, మనల్ని బాగా చూసుకునే వారికే ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఒకప్పుడు పందులతో ఉన్న గజ్వేల్ ఆసుపత్రి కేసీఆర్ వచ్చాక ఎలా అయిందో అందరూ గుర్తుంచుకోవాలని అన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చింది కానీ వాటిని అమలు చేయలేదన్నారు.

అప్పుడు బంగారం ఆశపెట్టిన ముఖ్యమంత్రి ఇప్పుడు మాట్లాడటం లేదని హరీష్ రావు విమర్శించారు. కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులపై తిట్ల వర్షం కురిపించడం తప్ప రేవంత్ రెడ్డికి తెలిసిందేమీ లేదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే అభివృద్ధి విషయంలో కేసీఆర్‌తో పోటీ పడాలని సవాల్ చేశారు.

Next Story