హైదరాబాద్: గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. పాలనా పరంగా తెలంగాణను బీఆర్ఎస్ నాశనం పట్టించింది..అని వ్యాఖ్యానించారు. హరీశ్ రావు కాళేశ్వరంలో దోచుకున్నారు కాబట్టే..కేసీఆర్ కేబినెట్‌లో రెండోసారి అవకాశం ఇవ్వలేదు. ఆర్థికపరంగా సంక్షోభం సృష్టించారు. హరీశ్ రావు,సంతోష్ రావు కాళేశ్వరంతో దోచుకున్నారు. మేడిగడ్డ కుంగిందని వాస్తవాలు చెబితే..కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తప్పుబట్టింది..అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
రాష్ట్రంలో పాలన, ఆర్థికపరంగా గాడిన పెడుతున్నాం. పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు చరిత్రలో నిలిచిపోయింది. అధికారంలోకి రాగానే చెప్పినట్లు రుణమాఫీ చేశాం. 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా ఇచ్చాం. దేశంలోనే రైతులకు ఏ రాష్ట్రం చేయని పని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. దాదాపు లక్ష కోట్ల రూపాయలను సంక్షేమం కోసం ప్రభుత్వం ఖర్చు చేసింది. రాష్ట్రంలో కులగణన చేస్తామని రాహుల్ గాంధీ ఎన్నికల ముందు అన్నారు. ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కులగణన చేసి చూపించాం. 42 శాతం రిజర్వేషన్ల కోసం బిల్లులు తీసుకుని వచ్చాం..అని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు.