కాంగ్రెస్ చీరలు, డబ్బులు పంచుతోంది: హరీశ్ రావు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అధికార పార్టీ చీరలు, కుక్కర్లు, డబ్బులు పంచుతుంది..అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.
By - Knakam Karthik |
కాంగ్రెస్ చీరలు, డబ్బులు పంచుతోంది: హరీశ్ రావు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అధికార పార్టీ చీరలు, కుక్కర్లు, డబ్బులు పంచుతుంది..అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. హరీష్ రావు నేతృత్వంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం కలిసింది. అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో డబ్బులు పంచడంపై ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదు. సీ విజిల్ యాప్ లో కంప్లైంట్ చేసిన అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. సెన్సిటివ్ కేంద్రాలు ఉన్నాయి. అక్కడ సెంట్రల్ బలగాలు పెట్టాలి. ఓటర్ల ఐడెంటిటీ గుర్తించిన తరవాత లోపలికి అనుమతించాలి. బయటనే వారిని ఆధార్ కార్డుతో వెరిఫై చేసి పంపాలి. అన్ని ఆధారాలు ఎలక్షన్ కమిషన్ కు పంపించాం. ఫేక్ ఐడి కార్డులు కుప్పలుకుప్పలు గా బయటికి వస్తున్నాయి. వాటిని గుర్తించలేదు..ఎన్నికల అధికారులు వాటినీ ఎందుకు కట్టడి చేయలేదు..అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
యూసఫ్ గూడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పక్కనే పోలింగ్ బూత్ ఉంది ఎలా అక్కడ అనుమతి ఇచ్చారు. అబ్జర్వర్లు ఉన్న పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరు గ్యారంటిల మీద రివ్యూ చేస్తున్నారు. రెండేళ్లలో ఎందుకు రివ్యూ చేయలేదు? రేవంత్ రెడ్డికి చెమటలు పడుతున్నాయి. ఓడిపోతున్నామనే భయంతో ఆదరాబాదరాగా రివ్యూలు చేస్తున్నారు. ఎన్నికలు సజావుగా జరిగేలా ఎలక్షన్ కమిషన్ చర్యలు చేపట్టాలి. స్వయంగా ఎన్నికల అధికారులు అక్కడ పరిస్తితి పర్యవేక్షిస్తామని చెప్పారు..అని హరీశ్ రావు పేర్కొన్నారు.