గూడెం రివర్స్ గేర్..మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌నే గెలిపించాలని పిలుపు

పటాన్‌చెరు రాజకీయాల్లో ఒక్కసారిగా పెను దుమారం రేగింది.

By -  Knakam Karthik
Published on : 9 Feb 2026 4:42 PM IST

Hyderabad News, Rangareddy District, PatanCheru MLA Gudem Mahipal Reddy, Municipal Elections, Congress, Brs

గూడెం రివర్స్ గేర్..మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌నే గెలిపించాలని పిలుపు

రంగారెడ్డి: పటాన్‌చెరు రాజకీయాల్లో ఒక్కసారిగా పెను దుమారం రేగింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన మనసులోని మాటను బయటపెట్టారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని ఆయన తన అనుచరులకు, కార్యకర్తలకు పిలుపునివ్వడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. అధికార కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే, ప్రతిపక్ష బిఆర్ఎస్ గెలుపు కోసం ఆయన మాట్లాడటం సంచలనం సృష్టిస్తోంది.

నియోజకవర్గంలోని తన ముఖ్య అనుచరులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మహిపాల్ రెడ్డి భావోద్వేగంగా ప్రసంగించారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత తనకు ఎదురవుతున్న పరిస్థితులను ఆయన వివరించారు. మనం ఎక్కడున్నా మన మూలాలు మరిచిపోకూడదు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పటాన్‌చెరు పరిధిలోని 5 మున్సిపాలిటీల్లో మన బిఆర్ఎస్ అభ్యర్థులనే భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి. 104 మంది కౌన్సిలర్లను ఏకతాటిపైకి తెచ్చి గులాబీ జెండా ఎగురవేయాలి" అని ఆయన పిలుపునిచ్చారు.

Next Story