రేవంత్ రెడ్డి కేబినెట్‌లోని పది మంది మంత్రులను 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్‌చార్జ్ మంత్రులుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రులు ఆయా జిల్లాల్లో “ప్రజాపాలన కార్యకలాపాల” అమలును సమీక్షించి పర్యవేక్షిస్తారని ఉత్తర్వులలో ప్రకటించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనా సౌలభ్యం కొరకు 33 జిల్లాలను ఏర్పాటు చేయగా.. ప్రస్తుత సర్కార్ మాత్రం పాత ఉమ్మడి 10 జిల్లాలనే పరిగణలోకి తీసుకుని ఇన్‌చార్జ్ మంత్రులను నియమించడం గమనార్హం. తద్వారా గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని ఇన్‌చార్జ్ మంత్రుల సంప్రదాయాన్ని మళ్లీ తెరమీదకు తీసుకువచ్చింది.
ఏ జిల్లాకు ఎవరు ఇన్‌చార్జ్..
1) ఉత్తమ్ కుమార్ రెడ్డి -కరీంనగర్
2) దామోదర రాజనరసింహ- మహబుబ్ నగర్
3)కొమటి రెడ్డి వెంకట్ రెడ్డి-ఖమ్మం
4)దుద్దిళ్ల శ్రీధర్ బాబు- రంగారెడ్డి
5)పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి- వరంగల్
6)పొన్నం ప్రభాకర్- హైదరాబాద్
7)కొండ సురేఖ-మెదక్
8) సీతక్క- అధిలాబాద్
9) తుమ్మల నాగేశ్వర్ రావు-నల్గొండ
10) జూపల్లి కృష్టారావు -నిజామాబాద్