మరో అవినీతి తిమింగలం దొరికిపోయింది

ఇటిక్యాల మండలం గద్వాల్‌లో పంచాయతీ రాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ పాండు రంగారావును అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పోలీసులు అరెస్టు చేశారు

By Medi Samrat  Published on  18 Nov 2024 8:21 PM IST
మరో అవినీతి తిమింగలం దొరికిపోయింది

ఇటిక్యాల మండలం గద్వాల్‌లో పంచాయతీ రాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ పాండు రంగారావును అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పోలీసులు అరెస్టు చేశారు. 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఆయన అడ్డంగా దొరికిపోయారు. మైనారిటీ కమ్యూనిటీ హాల్ పని కోసం మెజర్‌మెంట్ బుక్‌ను ప్రాసెస్ చేయడానికి, బిల్లును ఫార్వార్డ్ చేయడానికి లంచం అడిగారు. నిందితుడి నుంచి లంచం మొత్తాన్ని రికవరీ చేయగా అతని చేతి వేళ్లు, జేబులో రసాయన పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు.

నిందితుడిని నాంపల్లిలోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. పౌరులు తెలంగాణలో లంచానికి సంబంధించిన ఏవైనా సంఘటనలను టోల్ ఫ్రీ హాట్‌లైన్ 1064లో నివేదించవచ్చు. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని అధికారులు హామీ ఇస్తున్నారు. ఇటీవలి కాలంలో తెలంగాణలోని పలువురు ప్రభుత్వ అధికారులు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు.

Next Story