రైతులకు శుభవార్త..ఆ డబ్బులు జమ అవుతున్నాయని ప్రభుత్వం ప్రకటన
తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik
రైతులకు శుభవార్త..ఆ డబ్బులు జమ అవుతున్నాయని ప్రభుత్వం ప్రకటన
తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు 3 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులను జమచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా 3 ఎకరాల నుంచి 4 ఎకరాల మధ్య భూమి ఉన్న రైతుల ఖాతాల్లో జమ చేసింది. కాగా ఇందుకు సంబంధించి మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్ల నిధులను విడుదల చేసింది. మొత్తంగా 54.74 లక్షల మంది రైతులకు రూ.4666 కోట్లకు పైగా నిధులను మంజూరు చేసింది. మార్చి నెలాఖరు లోపు అర్హులైన ప్రతి ఒక్క రైతు అకౌంట్లో నిధులను క్రెడిట్ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.
అయితే కొత్తగా పాస్ బుక్ తీసుకుని రైతు భరోసా పథకానికి అప్లయ్ చేసుకున్న రైతులకు డబ్బులు జమ కాలేదు. ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల అకౌంట్లో డబ్బులు ఎప్పుడో జమ కావాల్సి ఉండగా కాలేదు. తాజాగా అలాంటి రైతుల ఖాతాల్లో కూడా నిధులు జమ అవుతున్నాయి. కొత్తగా పాస్ బుక్‌లు తీసుకుని సంబంధిత ఏఈవో ద్వారా రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకున్న వారు.. వారి బ్యాంక్ అకౌంట్లను చెక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.
ఎకరం వరకు భూమి ఉన్న కొంత మంది రైతులకు కొన్ని టెక్నికల్ సమస్యల కారణాలతో పాటు బ్యాంకు అకౌంట్ నంబర్లు తప్పు ఇవ్వడం లాంటి వాటి వల్ల కూడా ఇప్పటివరకు నిధులు క్రెడిట్ కాలేదని తెలుస్తోంది. కాగా ఇటీవల అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఆయా రైతుల నుంచి సరైన వివరాలను సేకరించారు. మార్చి 25వ తేదీన వారి అకౌంట్లలో కూడా డబ్బును జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.