వాళ్లు ఎటువైపు ఉన్నారో అర్థం కావడంలేదు..రాజాసింగ్ ఎమోషనల్ కామెంట్స్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు.
By Knakam Karthik
వాళ్లు ఎటువైపు ఉన్నారో అర్థం కావడంలేదు..రాజాసింగ్ ఎమోషనల్ కామెంట్స్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో పోలీసు అధికారులు కేటీఆర్ ఆదేశాలతో రేవంత్ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఇంట్లోని బెడ్‌రూమ్‌లోకి చొరబడి వెళ్లి మరీ రేవంత్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఇప్పుడు సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి ఆ సమయంలో తనను అరెస్ట్ చేసిన వాళ్లని ఏమీ చేయలేదని రాజాసింగ్ అన్నారు. ఇప్పుడేమో కేటీఆర్.. తాము అధికారంలోకి వచ్చాక రిటైరైన పోలీసుల మీద కూడా చర్యలు తీసుకుంటాం అంటున్నారు. పోలీసు శాఖతో పెట్టుకోవద్దు కేటీఆర్ అంటూ రాజాసింగ్ సూచించారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ల మాటనే పోలీసులు వింటారు. లీగల్‌గానే పని చేస్తారు, ఇది మర్చిపోయారా? కేటీఆర్ అంటూ రాజాసింగ్ ఎద్దేవా చేశారు.
మా బీజేపీ కార్యకర్తలపై పోలీసులు ఎన్నో కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారు. అంతే కాకుండా ఈ పోలీసులు మా బీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేశారు. నాపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించారు. షాకింగ్ విషయం ఏంటంటే నాపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించే సమయంలో మా బీజేపీ నేతలు కొంతమంది, అధికారులు కూడా పోలీసులకు మద్దతుగానే ఉన్నారు. ఆ సమయంలో ఒక పోలీస్ అధికారి నాతో చెప్పిన విషయం. నేను జైలులో ఉన్న సమయంలో మా అన్న, కార్యకర్తలే నా వెంబడి ఉన్నారు. ఇవాళ కూడా మా అన్న నా వెంటే ఉన్నాడని అనుకుంటున్నా. కానీ మా అన్న ఎటు వైపు ఉన్నారో నాకు అర్థం కావడం లేదు...అని రాజాసింగ్ అన్నారు.