మళ్లీ స్పష్టత ఇచ్చిన గంగుల
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ కాంగ్రెస్‌లో చేరతారనే ఊహాగానాలకు తెరపడింది.
By Medi Samrat Published on 24 Jun 2024 5:35 AM GMTబీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ కాంగ్రెస్‌లో చేరతారనే ఊహాగానాలకు తెరపడింది. ఆదివారం ఆయన పార్టీ అధినేత కేసీఆర్‌తో భేటీ అయిన తర్వాత ఈ విషయమై స్పష్టత వచ్చింది. కమలాకర్‌తో పాటు కరీంనగర్ మేయర్ సునీల్ రావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు చల్లా హరిశంకర్, బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు కేసీఆర్‌ను ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కలిశారు.
భేటీ అనంతనం.. తాను బీఆర్‌ఎస్‌ను వీడే ప్రసక్తే లేదని.. పార్టీలో కొనసాగుతూనే ప్రజా సమస్యలపై పోరాడతానని ఎమ్మెల్యే గంగుల స్పష్టం చేశారు. మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ వ్యాఖ్యలతో కమలాకర్ బీఆర్‌ఎస్‌ను విడిచిపెట్టనున్నారనే పుకార్లు వచ్చాయి. కమలాకర్ త్వరలో కాంగ్రెస్‌లో చేరతారని సత్యనారాయణ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌లో అన్నారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు కూడా ఇలాంటి పుకార్లు షికారు చేశాయి. అయితే.. కమలాకర్ ఓ వీడియో విడుదల చేసి ఆ పుకార్లను ఖండించారు.
మరోవైపు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను కలిసి అభినందనలు తెలిపిన మేయర్‌పై కూడా పార్టీ మారుతారనే ఊహాగానాలు చెలరేగాయి. వీటన్నింటిపై ఇప్పుడు స్పష్టత వచ్చింది.