గొర్రెల పంపిణీలో అక్రమాలు.. ఆ నలుగురు అరెస్ట్

బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలకు పాల్పడినందుకు నలుగురు అధికారులను అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసింది.

By Medi Samrat  Published on  22 Feb 2024 9:00 PM IST
గొర్రెల పంపిణీలో అక్రమాలు.. ఆ నలుగురు అరెస్ట్

బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలకు పాల్పడినందుకు నలుగురు అధికారులను అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసింది. ఇటీవలి కాగ్ నివేదిక ఈ పథకంలో భారీ అవకతవకలు, అవినీతి జరిగిందని సూచించింది. పశుసంవర్ధక శాఖ అధికారులను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రవి, కామారెడ్డి ఏరియా హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిత్య లను అరెస్ట్ చేశారు. అడల్ట్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ గణేష్, రంగారెడ్డి గ్రౌండ్ వాటర్ మేనేజర్ రఘుపతి రెడ్డిలను అరెస్ట్ చేశారు. ఈ నలుగురు గొర్రెల పంపిణీలో అవకతవకలకు పాల్పడి ఏకంగా 2.10 కోట్లు కొట్టేసినట్లుగా అధికారులు ఆరోపిస్తున్నారు.

గుంటూరు జిల్లాకు చెందిన గొర్రెల పెంపకం దారులు ఇచ్చిన ఫిర్యాదు పై ఏసీబీ కేసు నమోదు చేసుకుని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసింది. గొర్రెల పంపిణీ లో అవకతవకలు చేసినట్లుగా తేలడంతో నలుగురు అధికారులను అరెస్టు చేశారు. ఇన్‌వాయిస్‌ల సృష్టి, చెవి ట్యాగ్‌ల నకిలీ.. గొర్రెల రవాణా కోసం అంబులెన్స్‌లు, ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలను వాడడం వంటి చాలా అంశాల్లో అక్రమాలు చేశారని ఆరోపణలు వచ్చాయి. మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఏసీబీ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది.

Next Story