ఫార్ముల్ ఇ రేసు కేసులో మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. కోర్టు తీర్పు వెలువడే వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. ఫార్ములా-ఈ రేసు వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
గత ఏడాది హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై కేటీఆర్‌పై డిసెంబర్ 19న ఏసీబీ కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(1)(A), 13(2) కింద భారత శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 409, 120(B)తో పాటుగా ప్రథమ సమాచార నివేదిక (FIR) నమోదు చేశారు.