హైదరాబాద్: ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో క్విడ్ ప్రోకో జరిగినట్టు ఏసీబీ గగతంలో ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. రూ.54.88 కోట్ల నిధులు దారి మళ్లించినట్టు ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కేటీఆర్ 4 సార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. డాక్యుమెంట్లు, ఈమెయిల్స్, ఎలక్ట్రానిక్ రికార్డులు కలెక్ట్ చేసింది. దీనిపై కేటీఆర్‌ను ప్రొసిక్యూట్ చేసేందుకు సెప్టెంబర్‌లో ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరగా ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారు. దీంతో కేటీఆర్‌పై ఛార్జ్‌షీట్ వేయనుంది.
ప్రజా ప్రతినిధి కావటంతో కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి పొందిన ఏసీబీ.. త్వరలో కేటీఆర్ పై చార్జి షీట్ దాఖలు చేయనుంది. గత ఏడాది డిసెంబర్ 19న కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. సెప్టెంబర్ 9న కేటీఆర్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ కు ఏసీబీ లేఖ రాసింది. దీంతో 70 రోజుల తర్వాత గవర్నర్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కార్ రేసింగ్ కేసులో ఏ-1గా కేటీఆర్, ఏ-2గా అరవింత్ కుమార్ ఉన్నారు.
అటు ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు DoPT అనుమతి కొరకు ఏసీబీ ఎదురు చూస్తోంది. ఆ అనుమతి రాగానే కేటీఆర్, అర్వింద్ కుమార్, బీఎల్ ఎన్ రెడ్డి లపై ఏసీబీ ఛార్జ్‌షీట్ దాఖలు చేయనుంది. అరవింద్ కుమార్ ను ఇప్పటికే ఏసీబీ ఐదు సార్లు విచారించింది.