రేవంత్ రెండేళ్లుగా చేస్తున్న తప్పులకు వంద సార్లు జైల్లో వేయాలి

యూరియా కూడా ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంద‌ని మాజీమంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.

By -  Medi Samrat
Published on : 10 Sept 2025 8:56 PM IST

రేవంత్ రెండేళ్లుగా చేస్తున్న తప్పులకు వంద సార్లు జైల్లో వేయాలి

యూరియా కూడా ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంద‌ని మాజీమంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత, ప్రతిపక్షంపై కేసులతో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారంటూ కాంగ్రెస్‌పై ఆయ‌న మండిప‌డ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలు తీర్చకపోగా కొత్త కష్టాలు తెచ్చిపెడుతున్నారని.. డైవర్షన్ రాజకీయాలతో పబ్బం గడుపుతున్నార‌ని.. కరెంట్, కాళేశ్వరం, ఫొన్ ట్యాపింగ్ ఆరోపణలు అబద్దాలని తెలిపోయాయన్నారు.

ఇప్పుడు పనికిమాలిన ఈ ఫార్ములా కేసు ముందుకు తెస్తున్నారు.. ఈ ఫార్ములా అంశంలో అవసరమైతే రేవంత్ పైనే కేసు పెట్టాల్సి వస్తుందన్నారు. రేవంత్ పరిమితమైన జ్ఞానంతో ఉపయోగమైన ప్రాజెక్టులపై కేసులతో అక్కసు వెళ్లగక్కుతున్నారన్నారు. గ్రూప్ 1 తలవంపులతో ఈ ఫార్ములాతో డైవర్ట్ చేస్తున్నారని.. రేవంత్ రెండేళ్లుగా చేస్తున్న తప్పులకు వంద సార్లు జైల్లో వేయాలన్నారు.

ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సింది పోయి ప్రతిపక్షంపై కేసులంటూ చిల్లర వేషాలేస్తున్నారని.. ఈ ఫార్ములా కాదు రేవంత్ ఫార్ములాలన్ని ఫెయిలైపోయాయన్నారు. మీడియాలో సెన్సేషన్ కోసం ఆరాటపడటం మాని యూరియా కోసం గోస పడుతున్న రైతుల సంగతి చూడండని సూచించారు. సీబీఐ కేసుతో మోడీ బంధం బయటపడింది.. రేవంత్ కి ఇక రోజులు దగ్గరపడ్డట్టేన‌ని జోస్యం చెప్పారు.

Next Story