కాళేశ్వరం మాకు అప్పగిస్తే మూడ్రోజుల్లో నీళ్లు ఇస్తాం..సీఎంకు మాజీ మంత్రి సవాల్

బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం కూలిపోలేదు, మాకు అప్పగిస్తే మూడు రోజుల్లో రైతులకు నీళ్లు ఇస్తాం..అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సీఎం రేవంత్‌కు సవాల్ చేశారు.

By Knakam Karthik
Published on : 15 July 2025 12:08 PM IST

Telangana, Hyderabad, Former Minister Jagdishreddy, Cm Revanthreddy, Congress Government, Kaleshwaram Project

కాళేశ్వరం మాకు అప్పగిస్తే మూడ్రోజుల్లో నీళ్లు ఇస్తాం..సీఎంకు మాజీ మంత్రి సవాల్

బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం కూలిపోలేదు, మాకు అప్పగిస్తే మూడు రోజుల్లో రైతులకు నీళ్లు ఇస్తాం..అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సీఎం రేవంత్‌కు సవాల్ చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు రోత మాటల రేవంత్ రెడ్డి అని పిలుచుకుంటారు. నేను రేవంత్ రెడ్డి స్థాయికి దిగజారను. ఒక్క మహిళ అయినా బస్సు ఓనర్ ఉన్నారా ఆ సభలో. సీఎంకి జ్ఞానం పెరగలేదు, బుద్ధి పెరగలేదు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. మీ భట్టి విక్రమార్క రేషన్ కార్డు కేసీఆర్ పాలనలో కార్డులు పంచింది నిజం కాదా? కొత్త బిచ్చగాడు పొంగులేటి తాను పోస్ట్ చేసింది వాస్తవం కాదా. మేము పంచిన రేషన్ కార్డుల సంఖ్య 6 లక్షల 42 వేలు. అది నిజం కాకపోతే నేను చంప దెబ్బ తింటా. నిజమైతే మీరు చెంప దెబ్బ తింటారా?..అని జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు.

దేశంలోనే నల్గొండ జిల్లాను ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ గా మార్చాం. మీ చేతగాని తనంతో నిమిషానికి మూడు సార్లు కరెంటు పోతుంది. కేసీఆర్ హయాంలో కాళేశ్వరం నీళ్లు నల్గొండకి తీసుకొచ్చాం. మాది నీళ్ల దందా, రైతు దందా. మీది ప్లాట్ల దందా.. కమిషన్ల దందా... మతిలేని మంత్రికి నీళ్ల శాఖ ఇచ్చారు. కాళేశ్వరం కూలిపోలేదు...మాకు అప్పగిస్తే మూడు రోజుల్లో రైతులకు నీళ్లు ఇస్తాం. నేను చెప్పింది అబద్ధం అయితే రైతుతో చెంప దెబ్బ కొట్టించు. నిజం అయితే నువ్వుగానీ నీ మంత్రులు గానీ చెంపదెబ్బతింటారా. ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇచ్చారా. మీరు మాట్లాడింది ప్రతిది అబద్ధం అని నేను నిరూపించా. కేవలం చంద్రబాబు బనకచర్ల కోసం కాళేశ్వరం ఎండబెడుతున్నారు. నీళ్ల వ్యవహారంలో చంద్రబాబు రాసిచ్చిన స్లిప్పులనే సీఎం చదువుతున్నాడు. ఒక్కడినే ఉన్నా నల్గొండ నుంచి మీ వాళ్లను ఒక్కడిని రాకుండా చేస్తా. ఎవరికి గంజి ఉంది, ఎవరికి బెంజ్ ఉంది రెవెన్యూ రికార్డులు పరిశీలిస్తే తెలుస్తుంది..అని జగదీశ్ రెడ్డి మాట్లాడారు.

Next Story