ఆ నివేదిక పూర్తి ట్రాష్..అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతాం: హరీశ్‌రావు

కాళేశ్వరం కమిషన్ నివేదిక పూర్తిగా ట్రాష్ ..అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.

By Knakam Karthik
Published on : 5 Aug 2025 12:50 PM IST

Telangana, Congress Government, Kaleshwaram Commission, Harishrao, Kcr

ఆ నివేదిక పూర్తి ట్రాష్..అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతాం: హరీశ్‌రావు

కాళేశ్వరం కమిషన్ నివేదిక పూర్తిగా ట్రాష్ ..అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఆయన తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..ముఖ్యమంత్రి బాధ్యతను మాత్రమే కేసీఆర్ నిర్వర్తించారు. రాజకీయ జోక్యం ఎలా అవుతుంది. కేసీఆర్‌ను హింసించాలనే ధోరణి తప్ప.. రేవంత్ రెడ్డికి ప్రజా సమస్యలు పట్టడం లేదు. దేశంలో చాలా కమిషన్లు న్యాయస్థానాల ముందు నిలబడలేదు. గతంలో చంద్రబాబుపై కూడా కమిషన్లు వేశారు. అవి నిలబడలేదు. సర్ ఆర్థర్ కాటన్ మాదిరి.. కేసీఆర్ కూడా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోతారు...అని హరీశ్‌రావు పేర్కొన్నారు.

తెలంగాణలో కమిషన్ల ప్రభుత్వం నడుస్తుంది, 650పేజీల రిపోర్ట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలి. అసెంబ్లీ వేదికగా.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతాం. నివేదికలో నచ్చిన పేరాలను లీక్ చేశారు. నచ్చని నాయకులను బద్నాం చేస్తున్నారు. కమిషన్ నివేదిక కేంద్రాన్ని తప్పుపట్టినట్లుంది. కాళేశ్వరానికి అనుమతులు ఇచ్చిందే కేంద్ర ప్రభుత్వం. నివేదిక పూర్తి రిపోర్ట్ బయటకు వచ్చాక కాంగ్రెస్ సంగతి చూస్తాం. స్థానిక‌ సంస్థల ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి హడావుడి చేస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిన కుట్రతో జరిగిన వ్యవహారం. పోలవరం మూడుసార్లు కూలినా NDSA రాలేదు. మేడిగడ్డకు మాత్రం NDSA మూడు సార్లు వచ్చింది. ఇది కాంగ్రెస్, బీజేపీ కుటిల రాజకీయం..అని హరీశ్ రావు ఆరోపించారు.

Next Story