రేవంత్ కేబినెట్ అరడజను వర్గాలుగా విడిపోయింది: హరీశ్ రావు

రాష్ట్ర మంత్రివర్గం దండుపాళ్యం ముఠా మాదిరి తయారైందని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు.

By -  Knakam Karthik
Published on : 17 Oct 2025 5:40 PM IST

Telangana, Hyderabad, Former Minister Harishrao, Congress Government, Brs

రేవంత్ కేబినెట్ అరడజను వర్గాలుగా విడిపోయింది: హరీశ్ రావు

హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గం దండుపాళ్యం ముఠా మాదిరి తయారైందని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ భవన్‌లో హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణలో గన్ కల్చర్ వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డిపై కేబినెట్ మంత్రి కుటుంబ సభ్యులే ఆరోపణలు చేశారు. మంత్రి కుటుంబ సభ్యుల ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలి. ముఖ్యమంత్రే తుపాకీ పంపించారని, తమ్ముళ్ల కోసం ఫైల్స్ ఆపుతున్నారు. రాష్ట్ర క్యాబినెట్ దండుపాళ్యం ముఠా మాదిరి తయారైంది. వ్యాపారవేత్తలకు తుపాకులు పెట్టే సంస్కృతిని రేవంత్ తీసుకొచ్చారు. కేంద్రం స్పందించకుంటే కాంగ్రెస్, బీజేపీ మధ్య అక్రమ‌ సంబంధం ఉందని భావించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి సన్నిహితులే తుపాకీ పెట్టి బెదిరించే పరిస్థితులు వచ్చాయి. రాష్ట్రంలో‌ ఇంత జరుగుతుంటే కేంద్రం ఎందుకు మౌనంగా ఉంది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు ఎందుకు నోరు మెదపటం లేదు?. మంత్రుల పంచాయితీలు తెంచుకోవటానికే క్యాబినెట్ మీటింగ్స్..క్యాబినెట్ మీటింగ్ లో మంత్రులు తిట్టుకుంటున్నారు.. రేవంత్ రెడ్డి క్యాబినెట్ అర డజను వర్గాలుగా విడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం అతుకుల బొంతగా తయారైంసని స్వయానా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు..అని హరీశ్ రావు విమర్శించారు.

23 నెలల్లో ఏం సాధించారని విజయోత్సవాలు జరుపుతారు, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న చందంగా.. కాంగ్రెస్ నేతలు అందిన కాడికి దోచుకుంటున్నారు. తన హాయాంలో కేసీఆర్.. నీళ్ళు, నిధుల వాటాలు సాధించారు. రేవంత్ రెడ్డి హయంలో అవినీతి వాటాలు కోసం కొట్లాడుకుంటున్నారు, పారిశ్రామికవేత్తలు, సినిమా ఇండస్ట్రీ, కాంట్రాక్టర్లను బెదిరించి లొంగదీసుకుంటున్నారు. హ్యామ్ మోడల్‌పై బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక విచారణ జరుపుతాం. హ్యామ్ మోడల్ బోగస్.. కమిషన్లు దండుకోవటానికే హ్యామ్ మోడల్ అంటున్నారు. దీపావళికి అయినా హామీలు అమలు చేస్తారని ఎదురుచూసిన ప్రజలకు మళ్ళీ నిరాళే ఎదురైంది..అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.

Next Story