అవమానిస్తున్నారు.. అందుకే ఈ నిర్ణయం: బాబూమోహన్

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఊహించని షాక్ తగిలింది. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి బాబూమోహన్ ప్రకటించారు.

By Medi Samrat  Published on  7 Feb 2024 3:41 PM IST
అవమానిస్తున్నారు.. అందుకే ఈ నిర్ణయం: బాబూమోహన్

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఊహించని షాక్ తగిలింది. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి బాబూమోహన్ ప్రకటించారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లేదని.. అందుకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. తన రాజీనామా లేఖను బీజేపీ పెద్దలకు పంపిస్తున్నట్లు తెలిపారు. కొంతకాలంగా తాను పార్టీలో ఇమడలేకపోతున్నానని.. తనకు సరైన ప్రాధాన్యత దక్కనందుకే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పార్టీలో తనను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్రమంత్రి, ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తన ఫోన్ కూడా ఎత్తడం లేదని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి తనను దూరం పెడుతున్నారని అన్నారు. భవిష్యత్తులో తాను వరంగల్ లోక్ సభకు పోటీ చేస్తానన్నారు. ఏ పార్టీ అయినా బాగా పని చేసిన వారిని ఉండాలని కోరుకుంటుందని... కానీ తెలంగాణ బీజేపీలో మాత్రం పని చేసే వారిని వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Next Story