నా కుమారుడిని కావాలనే ఇబ్బంది పెడుతున్నారు : షకీల్

గతంలో జరిగిన కారు ప్రమాదంలో శిశువు మృతికి సంబంధించి బీఆర్‌ఎస్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ కుమారుడు రహీల్ అమీర్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు తాజాగా అభియోగాలను చేర్చారు

By Medi Samrat  Published on  17 April 2024 3:30 PM GMT
నా కుమారుడిని కావాలనే ఇబ్బంది పెడుతున్నారు : షకీల్

గతంలో జరిగిన కారు ప్రమాదంలో శిశువు మృతికి సంబంధించి బీఆర్‌ఎస్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ కుమారుడు రహీల్ అమీర్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు తాజాగా అభియోగాలను చేర్చారు. అయితే దీనిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ మీడియా ముందుకు వచ్చారు. జూబ్లీహిల్స్ కేసులో తన కుమారుడిని ఇరికించేందుకు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. తనపై రాజకీయ కక్ష ఉంటే తన కుమారుడిని ఇబ్బంది పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. తన కుమారుడిని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. తన కుమారుడికి ఏమైనా హాని జరిగితే వెస్ట్ జోన్ డీసీపీ, పంజాగుట్ట ఏసీపీ,సిఐ,జూబ్లీహిల్స్ సీఐ బాధ్యత వహించాలన్నారు. తన కుమారుడి తప్పుంటే చట్టబద్ధంగా ఉరి తీసినా ఒప్పుకుంటానన్నారు.ఈ కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని షకీల్ డిమాండ్ చేశారు.

రెండు నెలల వయస్సు గల రణవీర్ చౌహాన్, మరో ముగ్గురు గాయపడిన ఘటనలో అంతకుముందు పోలీసులు రహీల్‌కు క్లీన్ చిట్ ఇచ్చారు. అప్పుడు పోలీసులు రహీల్ డ్రైవింగ్ చేయలేదని పేర్కొన్నారు. రహీల్ బంధువును అప్పట్లో పోలీసులు అరెస్టు చేశారు.

Next Story