ములుగులో మావోయిస్టుల కలకలం.. మాజీ స‌ర్పంచ్‌ కిడ్నాప్

Ex Sarpanch kidnapped by maoists in mulugu. ములుగు జిల్లాలో ఓ మాజీ సర్పంచ్‌ కిడ్నాప్‌ కలకలం రేపుతోంది. జిల్లా పరిధిలోని వెంకటాపురం మండలం సూరవీడుకు చెందిన

By అంజి
Published on : 21 Dec 2021 10:09 AM

ములుగులో మావోయిస్టుల కలకలం.. మాజీ స‌ర్పంచ్‌ కిడ్నాప్

ములుగు జిల్లాలో ఓ మాజీ సర్పంచ్‌ కిడ్నాప్‌ కలకలం రేపుతోంది. జిల్లా పరిధిలోని వెంకటాపురం మండలం సూరవీడుకు చెందిన మాజీ సర్పంచ్‌ రమేష్‌ కిడ్నాప్‌కు గురయ్యారు. అయితే అతడిని మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సోమవారం సాయంత్రం మాజీ సర్పంచ్‌ రమేష్‌.. చర్లకు వెళ్తుండగా మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారని కుటుంబ సభ్యులు చెప్పారు. కాగా మాజీ సర్పంచ్‌ కిడ్నాప్ కావడంతో స్థానికంగా అలజడి రేకెత్తుతోంది. మాజీ సర్పంచ్‌ కిడ్నాప్‌పై అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు.. రమేష్‌ ఆచూకీ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే రమేష్‌ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తెలంగాణలోని జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం జిల్లాల్లో తరచూ మావోయిస్టుల కదలికలు కనిపిస్తుంటాయి. అయితే మాజీ సర్పంచ్‌ రమేశ్‌ను మావోయిస్టులే కిడ్నాప్‌ చేశారా.. లేక మరెవరైనా కక్షతో చేశారా? అన్నది తెలియాల్సి ఉంది. రమేష్‌ ఆచూకీని కనిపెట్టేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story