కేసీఆర్‌పై పగతోనే టిమ్స్‌ను సీఎం రేవంత్ పడావు పెట్టాడు: హరీశ్‌రావు

బస్తీ దవాఖానాలను సుస్తీ పట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీది..అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.

By -  Knakam Karthik
Published on : 4 Oct 2025 2:49 PM IST

Telangana, Hyderabad, Congress Government, Ex Minister Harishrao, Brs

కేసీఆర్‌పై పగతోనే టిమ్స్‌ను సీఎం రేవంత్ పడావు పెట్టాడు: హరీశ్‌రావు

హైదరాబాద్: బస్తీ దవాఖానాలను సుస్తీ పట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీది..అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఎల్బీనగర్‌లోని టిమ్స్ ఆస్పత్రి నిర్మాణ పనులను బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. వందేళ్ల ముందు చూపు కేసీఆర్‌ది అయితే, మంద బుద్ధి కాంగ్రెస్ పార్టీది. రెండేళ్లుగా టిమ్స్ ఆసుపత్రులను పడావు పెట్టిన చేతగాని సీఎం రేవంత్. వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ లను పూర్తి చేసి, వినియోగంలోకి తేవడంలో ప్రభుత్వం ఫెయిల్, కేసీఆర్ మీద కక్షతో ఆసుపత్రులపై పగ పెంచుకోవడం దారుణం, ప్రజల ప్రాణాలు కాపాడే ఆసుపత్రులతో రాజకీయాలు చేయడం తగదు. డేట్లు, డెడ్ లైన్లు మారాయి తప్ప పనులు పూర్తి కావడం లేదు. బిఆర్ఎస్ మంజూరు చేసిన మహేశ్వరం, కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీలను రద్దు చేయడం దుర్మార్గం..అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒకటో తేదీనే జీతాలు అన్న రేవంత్ రెడ్డి, 6 నెలలుగా బస్తీ వైద్యులకు, సిబ్బందికి ఎందుకు వేతనాలు చెల్లించలేదు? రూ. 1400 కోట్లు ఆరోగ్య శ్రీ బకాయిలు పెట్టి, పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. కంటి వెలుగు పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదు? బిఆర్ఎస్ పాలనలో పురోగమనం, కాంగ్రెస్ పాలనలో తిరోగమనం. వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ ఆసుపత్రుల పనులు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం..లేదంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం..అని హరీశ్‌రావు పేర్కొన్నారు.

Next Story