ఒక సైకోకు ఎమ్మెల్సీ ఇచ్చి.. నన్ను హింస పెట్టే పని చేస్తున్నారు : ఈటెల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Etela Rajender Sensational Comments on CM KCR. హుజూరాబాద్ లో వందలకొట్లు ఖర్చు పెట్టినా బీఆర్ఎస్‌ గెలవలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు.

By Medi Samrat  Published on  28 Jun 2023 11:01 AM GMT
ఒక సైకోకు ఎమ్మెల్సీ ఇచ్చి.. నన్ను హింస పెట్టే పని చేస్తున్నారు : ఈటెల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

హుజూరాబాద్ లో వందలకొట్లు ఖర్చు పెట్టినా బీఆర్ఎస్‌ గెలవలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. ఖాజీపేట రైల్వే స్టేషన్ లో మీడియాతో మాట్లాడుతూ.. హుజూరాబాద్‌లో కేసీఆర్‌ వ‌ద్ద‌న్నా న‌న్ను గెలిపించినందుకు.. ప్రజలకు ఆయన పద్దతి రుచి చూపించేందుకు ఒక సైకోకు ఎమ్మెల్సీ ఇచ్చి నన్ను హింస పెట్టే పని చేస్తున్నారని అన్నారు. ప్రజలందరినీ, అణగారిన వర్గాల వారిని బెదిరించడం చేస్తున్నారని.. ప్రెస్ వారిని కూడా భయపెడుతున్నారని ఈటెల ఫైర్ అయ్యారు. అసలే పిచ్చోడు.. వాడికి ప్రగతి భవన్ అండగా ఉంది అని.. అధికారిక కార్య‌క్ర‌మాల‌కు తాను సైలెంట్ గా ఉన్నాన‌ని ఈటెల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పంగిడిపల్లిలో మా మీద దాడి చేశారు. ప్లాన్డ్ గా దాడి జ‌రిగింద‌ని ఆరోపించారు. పోలీసులు మాత్రం మా వాళ్ళను పట్టుకుపోయి కొట్టి కేసులు పెట్టారని అన్నారు.


మొన్న జీఎస్ఆర్‌ టీవీ కెమెరామన్ వీడియో తీశారని.. అతని కొట్టే సందర్భంలో.. అతని కులం ముదిరాజ్ అని చెప్పగానే వీరంగం వేశారు. ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టారు. ఈటల రాజేందర్ ను 20 కోట్లు ఇచ్చి చంపుతామని చెప్పినట్టుగా ఆడియో రికార్డ్ అయ్యింది. వాటిపై కంప్లైంట్ ఇచ్చామని అన్నారు.

ఇవన్నీ ప్రగతి భవన్ కేంద్రంగా కేసీఆర్ చేస్తున్న పనులని ఈటెల ఆరోపించారు. ఈ పనులు ఆపకపోతే హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో, జమ్మికుంట గాంధీ చౌరస్తాలో చెప్పులు మెడలో వేసి తిప్పుతాం అని నిన్నే మా వాళ్ళు చెప్పారని అన్నారు. నయీంకే భయపడలేదు. సాంబశివుడును చంపినప్పుడు.. అక్కడికి వెళ్ళి నేను మాట్లాడుతూ.. నయీం కుక్క చావు చస్తావు అని చెప్పా.. అప్పుడు అనేక బెదిరింపులకు దిగారు.. అయినా భయపడలేదు. ఇప్పుడు సీఎం చిల్లర గాళ్ల‌తో దాడి చేయిస్తా అని అంటే భయపడతానా..? అని ప్ర‌శ్నించారు. హుజూరాబాద్ లో జరిగే అరాచకాలపై అనేక సార్లు సీపీ లకు చెప్పినట్లు వెల్ల‌డించారు. కానీ కరీంనగర్ సీపీ స్పందించలేదని అన్నారు. నీచులను, శాడిస్ట్ లను ప్రేరేపిస్తే ఖబడ్దార్.. నీ వెంబడి పడతా అని హెచ్చరించారు.

కేటీఆర్ నా భద్రత గురించి మాట్లాడినట్లు తెలిసిందని వెల్ల‌డించారు. కేసీఆర్‌ హెచ్చరిస్తున్నా.. నీ తాత జాగీరు కాదు.. రక్షణ కల్పించాల్సిన భాధ్యత ప్రభుత్వానిదేన‌ని అన్నారు. కేంద్రం భద్రత ఇస్తుంది అని కూడా టీవీ లోనే చూసా.. ఐబీ నివేదిక ఇచ్చివుంటుందని అన్నారు. పోలీసుల రక్షణ కాదు.. ప్రజలే రక్షించుకుంటారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీని వెంటనే బర్తరఫ్ చెయ్యాలి అని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.


Next Story