అనుచిత వ్యాఖ్యలపై కేసీఆర్‌కు ఈసీ నోటీసులు
కాంగ్రెస్ నేతలపై తప్పుడు వ్యాఖ్యలు, అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు భారత ఎన్నికల సంఘం నోటీసులు అందజేసింది.
By అంజి Published on 17 April 2024 9:19 AM ISTఅనుచిత వ్యాఖ్యలపై కేసీఆర్‌కు ఈసీ నోటీసులు
కాంగ్రెస్ నేతలపై తప్పుడు వ్యాఖ్యలు, అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు భారత ఎన్నికల సంఘం నోటీసులు అందజేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా సిరిసిల్లలో ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత జి.నిరంజన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతలను దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫిర్యాదు స్వీకరించిన ఈసీ.. గురువారం ఉదయం 11 గంటలలోపు వివరణ ఇవ్వాలని పేర్కొంటూ కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 5న సిరిసిల్లలో వ్యాఖ్యలు చేయడం ద్వారా కమిషన్ ప్రవర్తనా నియమావళి, కమిషన్ సలహా/సూచనల నిబంధనలను ఉల్లంఘించినట్లు కమిషన్ ప్రాథమికంగా గుర్తించింది.
కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు..
- బతుకుదెరువు కోసం నిరోధ్‌లను అమ్ముకోవాలని ఓ కాంగ్రెస్ వాది అన్నారు. నిరోధ్‌లు అమ్ముకుని బతకాలా కుక్కల కొడుకుల్లారా!?
- నీటి సామర్థ్యంపై అవగాహన లేని 'లత్‌ఖోర్లు' రాజ్యాన్ని పాలిస్తున్నారు. అసమర్థ 'చావట దద్ధమ్మ'లు రాజ్యంలో ఉన్నందున ఈ పరిస్థితి ఏర్పడింది.
- మీ ప్రభుత్వం 'లత్ఖోర్ల' ప్రభుత్వం. మీరు అబద్ధాలు చెప్పి 1.8 శాతం ఓట్లతో గెలిచారు.
-. మీరు పక్కా చవటలు, దద్దమ్మలు, చేతకాని చవటలు అని అర్థం. (మీరు పనికిరాని వారు)
- మీరు ఐదు వందలు బోనస్ ఇవ్వడంలో విఫలమైతే మేము మీ గొంతు కోస్తాము
కేసీఆర్ వ్యాఖ్యలు సరికాని ఆరోపణలు, అవమానకరమైన వ్యాఖ్యలు అని, తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఎదుటి పక్షం/నాయకుడి ప్రతిష్టను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఈసీ పేర్కొంది.
ఏప్రిల్ 18, 2024లోపు వ్యాఖ్యలకు సంబంధించి తన స్టాండ్‌ను వివరించేందుకు కేసీఆర్‌కు కమిషన్ అవకాశం ఇచ్చింది