5.3 తీవ్రతతో భూకంపం.. తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలిసారి!

తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

By అంజి  Published on  4 Dec 2024 9:42 AM IST
Earthquake, Telugu states, Telangana, APnews, Mulugu

5.3 తీవ్రతతో భూకంపం.. తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలిసారి!

తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సరిగ్గా ఉదయం 7.27 నిమిషాల సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది. అత్యధికంగా ములుగులో రిక్టర్‌ స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. రెండు నుంచి ఐదు సెకండ్ల పాటు భూమి కంపించింది. ఎప్పుడైనా అక్కడక్కడా భూప్రకంపనలు వస్తుంటాయని, కానీ ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి చాలా చోట్ల భూమి కదలడం భయానికి గురిచేసిందని ప్రజలు చెబుతున్నారు. అటు గడిచిన 20 ఏళ్లలో తెలంగాణలో ఇంత తీవ్రతతో ప్రకంపనలు రావడం ఇదే తొలిసారి.

హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో ఈ రోజు ఉదయం భూమి కంపించింది. ఎన్‌ఎస్‌సీ రిపోర్టు ప్రకారం.. కిస్మత్‌పుర, గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రి పక్కన మీనాక్షి బాంబుస్‌, జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 67, బంజారాహిల్స్‌ ఆడియో విజార్డ్‌, అమీర్‌పేట, మధురానగర్‌ ఎస్‌బీఐ, ఎస్సార్‌ నగర్‌ గ్రాండ్‌ అయోధ్య హోటల్‌, అత్తాపూర్‌ ఏఎం కిరాణా స్టోర్‌, చిక్కడపల్లి పీపుల్‌ పార్క్‌ పక్కన, బెల్‌ దగ్గర నక్షత్ర క్యాటరింగ్‌, గౌలిదొడ్డి గురుకుల పాఠశాల వద్ద భూమి కంపించింది.

భూకంపాలు ఎందుకు వస్తాయి?

పర్యావరణానికి నష్టం జరగడం, భూగర్భ జలాన్ని అధికంగా దుర్వినియోగం చేయడం, అడవుల్లో చెట్లు నరకడం తదితర కారణాలతో భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు ప్రాజెక్టుల్లో నీటి ఒత్తిడి భూమిపై పడి భూగర్భంలో మార్పులు వచ్చి భూమి కంపిస్తుంది. అలాగే భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు కూడా అంతర్గత పొరల్లో సర్దుబాట్ల వల్ల ప్రకంపనలు వస్తుంటాయి. భూప్రకంపనలు కొలిచే సాధనాన్ని సిస్మోమీటర్ అంటారు.

Next Story